Health Tips: ఈ నూనె గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది..!
Health Tips: ఆలివ్ ఆయిల్ గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించడంలో పాటుగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా నియంత్రిస్తుంది.

ఆలివ్ ఆయిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది గుండెను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ ఆయిల్ ను తీసుకోవడం వల్ల గుండెపోటు (Heart attack) వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.
ఈ నూనెను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటు రిస్క్ తగ్గడంతో పాటుగా శరీరంలో కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ సమతుల్యంగా ఉంటేనే గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. వీటితో పాటుగా ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
గుండెను దృఢంగా చేస్తుంది.. ఆలివ్ ఆయిల్ లో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (unsaturated fatty acids), పాలీ ఫెనాల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను అనేక అనారోగ్య సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. ప్రతరోజూ అరటీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఆలివ్ ఆయిల్ ఇతర ప్రయోజనాలు..
ఈ నూనెలో ఒమేగా 3 ప్యాటీ ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతో పాటుగా వాపును కూడా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
అంతేకాదు ఈ ఆలివ్ ఆయిల్ వాస్కులర్ పనితీరును , గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి దీన్ని మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నూనెలో పాలీఫెనాల్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇది మంచి లిపిడ్ ప్రొఫైల్. ఈ పాలీ ఫెనాల్స్ గుండెపోటును, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
ఈ నూనె అధిక రక్తపోటు సమస్యను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అంటే దీనిలో ఉండే పాలీ ఫెనాల్స్ , మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు రక్తపోటును నియంత్రిస్తాయి.
మీకు తెలుసా.. ఈ నూనెలు ఓవర్ వెయిట్ ను కూడా తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ నూనెతో ఆహారాన్ని వండుకుని తింటే చక్కటి ఫలితం ఉంటుంది.
olive oil
ఆలివ్ ఆయిల్ చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి.
ఈ నూనె జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఆ ఆలివ్ ఆయిల్ ను జుట్టుకు రాయడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుంది. హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది.