ఫ్రిజ్ కూలింగ్ తగ్గిపోవడాదనికి వేడి వేడి ఆహారాలు కూడా ఒక కారణమే. కాబట్టి పూర్తిగా చల్లగా ఉన్న ఫుడ్ నే ఫ్రిజ్ లో పెట్టండి. అప్పుడే మీ ఫ్రిజ్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది.
ఫ్రిజ్ కూలింగ్ తగ్గిపోతుందంటే మీరు ఫ్రిజ్ డోర్ సీల్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండండి. ఫ్రిజ్ డోర్ సరిగ్గా క్లోజ్ కాకపోతే కూలింగ్ బయటకు వెళ్లిపోతుంది.
ఫ్రిజ్ డోర్ ని తరచుగా తెరిస్తే కూడా ఫ్రిజ్ లోపల చల్లగా ఉండదు. బయటి వేడి గాాలి లోపలికి వెళ్లడం వల్ల ఇలా ఫ్రిజ్ లోపల చల్లగా ఉండదు.
ఫ్రిజ్ లోపల కూలింగ్ తగ్గిపోవడానికి దుమ్ము, ధూళి కూడా ఒక కారణమే. ఫ్రిజ్ లోపల ఇవి పేరుకుపోతే ఫ్ఱిజ్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
ఫ్రిజ్ సరిగ్గా పనిచేయాలంటే ఫ్రిజ్ లోపల శుభ్రం చేయడమే కాదు.. బయటి భాగాన్ని కూడా క్లీన్ చేయాలి. ఎందుకంటే ఫ్రిజ్ బయటి భాగంలోనే దుమ్ము ఎక్కువగా పేరుకుపోతుంది.
చాలా మంది ఫ్రిజ్ ను గోడకు దగ్గర పెడుతుంటారు. కానీ ఫ్రిజ్ ను ఎప్పుడూ కూడా గాలి ప్రసరణ బాగుండే ప్లేస్ లోనే పెట్టాలి. అప్పుడే ఫ్రిజ్ కూలింగ్ అవుతుంది.
చాలా మంది ఫ్రిజ్ ను రకరకాల వస్తువులతో నింపేస్తుంటారు. కానీ ఫ్రిజ్ కూలింగ్ బాగుండాలంటే మాత్రం ఫ్రిజ్ లో ఎంత స్థలం ఉందో అంతవరకే వస్తువులను నిల్వ చేయాలి.