కీరదోసకాయలతో అదిరే అందం మీ సొంతం
కీరదోసకాయ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. మీకు తెలుసా? ఇది మన చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

cucumber
కీరదోసకాయల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి. దీనిలో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లు కూడా ఉంటాయి. విటమిన్ సి కొత్తత కణాల ఏర్పాటుకు సహాయపడతాయి. దీనిలోని ఫోలిక్ ఆమ్లం పర్యావరణ కాలుష్య కారకాలకు వ్యతిరేకంగా చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఈ పదార్థాలు మీ చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
cucumber
కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. అలాగే చర్మం వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. కీరదోసకాయ జిడ్డుగల చర్మానికి ప్రయోజనంగా ఉంటుంది. ఇది అదనపు నూనెను తగ్గిస్తుంది.
సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేడియేషన్, కాలుష్యం కారణంగా ఫ్రీ రాడికల్స్ మన చర్మం సెల్యులార్ నిర్మాణంలో కనిపిస్తాయి. ఈ అస్థిర రసాయనాలు మన డీఎన్ఎకు హాని కలిగిస్తాయి. అలాగే మన చర్మంలోని కణాలకు హాని కలిగిస్తాయి. దోసకాయలలో కనిపించే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. అలాగే మన చర్మాన్ని రక్షిస్తాయి.
2010 అధ్యయనం ప్రకారం.. దోసకాయలలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు ఉంటాయి. టానిన్లు ఒక రకమైన సహజ ఆస్ట్రింజెంట్. ఇది చర్మం కింద అదనపు ద్రవాన్ని పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఉబ్బిన, కళ్ల వాపును తగ్గిస్తుంది.
మన చర్మం నూనెను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దోసకాయ ద్వారా నియంత్రించొచ్చు. ఇది ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. మీ చర్మంపై రంధ్రాలను సంకోచించేలా చేస్తుంది. నూనె ఉత్పత్తి నియంత్రణలో ఉన్నప్పుడు, చర్మ రంధ్రాలు బిగుతుగా ఉన్నప్పుడు మొటిమలొచ్చే అవకాశం చాలా తక్కువ.
చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి కూడా కీరదోసకాయ ఎంతో సహాయపడుతుంది. కీరదోసకాయలో ఉండే సిలికా అనే ఖనిజం బంధన కణజాలాలను బలోపేతం చేసి చర్మానికి తక్షణ మెరుపును ఇస్తుంది. ఈ కీరదోసకాయ విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.