MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బాదం నూనెను వాడితే.. ఇకనుంచి ఆ సమస్యలే ఉండవు..

బాదం నూనెను వాడితే.. ఇకనుంచి ఆ సమస్యలే ఉండవు..

ప్రతిరోజూ బాదం నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగుతుంది. వెంట్రుకలు తెగిపోయే ప్రమాదం ఉండదు. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అలాగే..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 16 2022, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బాదం నూనెలో పొటాషియం, మోనోశాచురేటెడ్, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి, జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బాదం నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎన్నో హెయిర్ సమస్యలు తగ్గిపోతాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

బాదం నూనె మన జుట్టును సన్నితంగా, షైనీగా చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఇ, ప్రోటీన్లు, పొటాషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జింక్ వంటి పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. బాదం నూనెలో జుట్టును హైడ్రేటింగ్, పోషణ లక్షణాల ఉంటాయి. బాదం నూనెను క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు మృదువుగా, తక్కువ జిడ్డుగా మారుతుంది. అసలు బాదం నూనెను పెట్టడం వల్ల జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

39


స్కాల్ప్ ఇన్ఫెక్షన్

హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉండే రసాయనాలు, కాలుష్య కారకాలు, వేడి, దుమ్ము, దూళి జుట్టును బాగా దెబ్బతీస్తాయి. అలాగే సంక్రమణ, మంటకు దారితీస్తాయి. దీనివల్ల చుండ్రు, జుట్టు రాలడం, బలహీనమైన జుట్టు వంటి జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. 

అయితే జుట్టుకు బాదం నూనెను అప్లై చేయడం వల్ల మంట తగ్గుతుంది. ఎందుకంటే ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్లీరియల్ లక్షణాలు ఉంటాయి. 
 

49

జుట్టు తెగిపోయే ప్రసక్తే ఉండదు

పోషకాల లోపం, డ్రై హెయిర్ వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. అలాగే తెగిపోతుంది. అయితే బాదం నూనె నెత్తిమీద మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చుండ్రును తొలగిస్తుంది. అలాగే ఇది ఆర్థీకరణను పెంచుతుంది. 

ఈ నూనెలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎంతో సహాయపడతాయి. ఇవి జుట్టు సన్నబడటాన్ని కూడా తగ్గిస్తాయి. 
 

59

మెరిసే జుట్టు

బాదం నూనెలో కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ జుట్టుకు అవసరమైన ఆర్ధీకరణను అందిస్తాయి. ఈ నూనె నెత్తిమీద, జుట్టు మూలాలను తేమగా చేస్తాయి. దీంతో మీ జుట్టు మృదువుగా, అందంగా మెరుస్తుంది. 
 

 

69

జుట్టును బలోపేతం చేస్తుంది

పలు అధ్యయనాల ప్రకారం.. బాదం నూనెలో ఉండే లినోలెయిక్  ఆమ్లం, ఒలెయిక్ ఆమ్లం మీ జుట్టును బలోపేతం చేస్తాయి. విటమిన్ ఇ, విటమిన్ బి7 లు ఉండే నూనె, బాదం నూనె రక్తప్రసరణను పెంచుతుంది. దీంతో మీ జుట్టు మూలాల నుంచి మరమ్మత్తు చేయబడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా మీ జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి. 
 

79

జుట్టు పెరుగుతుంది

జుట్టు ఒత్తుగా, బలంగా పెరిగేందుకు సహాయపడే నూనెల్లో బాదం నూనె ముందుంటుంది. బాదం నూనెలో విటమిన్  ఇ అనే సహజ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది పర్యావరణ కాలుష్యం ప్రభావం నుంచి జుట్టును రక్షిస్తుంది. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ నూనెవల్ల జుట్టు ఊడటం ఆగి.. వేగంగా పెరుగుతుంది.
 

89

గడ్డం పెరుగుదల

గడ్డాన్ని ఒత్తుగా పెంచాలనుకునే వారికి బాదం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో ప్రోటీన్లు, మెగ్నీషియం, బయోటిన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.  ఇవి గడ్డం జుట్టును వేగంగా, ఒత్తుగా పెంచేందుకు సహాయపడతాయి. అలాగే డ్రై హెయిర్ సమస్యను పోగొడుతాయి. ఈ నూనె  రంధ్రాలకు అడ్డుపడే  మృత కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. 
 

99

చుండ్రును తగ్గిస్తుంది

నెత్తి మీద చుండ్రు ఏర్పడటానికి కారణాలేన్నో ఉంటాయి. డ్రై స్కిన్, జుట్టు పరిశుభ్రంగా లేకపోవడం, కొన్ని రకాల షాంపూలు, నెత్తిమీద సోరియాసిస్, తామర, ఈస్ట్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి కారణాల వల్ల చుండ్రు ఏర్పడుతుంది. నెత్తిమీద చుండ్రు పేరుకుపోతే నెత్తికి ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. దీనివల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. అయితే బాదం నూనెను జుట్టు రాయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 30 వేల‌తో మొద‌లై నెల‌కు రూ. 30 ల‌క్ష‌లు.. అవినాష్ స‌క్సెస్ స్టోరీ, ఇలా చేస్తే మీకు కూడా సాధ్య‌మే
Recommended image2
Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు
Recommended image3
Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే బర్నర్‌ను వెంటనే ఇలా క్లీన్ చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved