అందంగా కనిపించాలని ముఖానికి ఆవిరి పడుతున్నారేమో.. దీనివల్ల ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?
ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు తరచుగా ముఖానికి ఆవిరిపడుతుంటారు. కానీ దీన్నిమితిమీరి వాడితే మాత్రం ఎన్నో చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం అందంగా మెరిసిపోతుంది. మృదువుగా కనిపిస్తుంది. ఆవిరి మీ ముఖాన్ని లోతుగా శుభ్రపరచడంలో ఎంతో ఎఫెక్టీవ్ గా సహాయపడుతుంది. ఆవిరితో చర్మ రంధ్రాలు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. దీంతో చర్మం సులువుగా శుభ్రపడుతుంది. ఆవిరి చర్మ కణాలను పెంచుతుంది. అలాగే రక్త ప్రవాహాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుంది. అలాగే మీ ముఖాన్ని అందంగా,కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. అందుకే ముఖానికి 4 నుంచి 5 నిమిషాల పాటు ఆవిరిని పడుతుంటారు. అసలు ఆవిరి పట్టడం వల్ల ముఖానికి ఎలాంటి ప్రయోజనాలు, ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖానికి ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు
రంధ్రాలు తెరుచుకుంటాయి
ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇది చర్మ రంధ్రాలను తెరుస్తుంది. అలాగే చర్మంపై పేరుకుపోయిన నల్లని మచ్చలను, తెల్లని మచ్చలను పూర్తిగా పోగొడుతుంది. అలాగే మీ చర్మం మృదువుగా మారుతుంది. దీంతో వీటిని తొలగించడం సులభం అవుతుంది. అయితే ఈ మచ్చలను పోగొట్టడానికి పదునైన వస్తువును ఉపయోగించడం మానుకోండి.
లోతైన ప్రక్షాళన
కొన్ని రోజుల పాటు మసాజ్ వల్ల చర్మం పొరల్లో ఉండే మురికిని శుభ్రం చేయడానికి ఆవిరి ఎంతో సహాయపడుతుంది. ఆవిరి పట్టిన తర్వాత నల్లని మచ్చలను, తెల్లని మచ్చలను తొలగించండి. ఆ తర్వాత మెత్తటి స్క్రబ్ ను ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేయండి. దీంతో చర్మంలో ఉండే దుమ్ము సులువుగా బయటకు పోతుంది.
steam
చనిపోయిన చర్మ కణాలను తొలగించడం సులభం
ఆవిరి పట్టిన తర్వాత చనిపోయిన చర్మ కణాలు బయటకు వస్తాయి. ఇది మొటిమలు అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మీ చర్మం నేచురల్ గా హెల్తీగా, క్లియర్ గా కనిపిస్తుంది. నిజానికి ఆవిరి వల్ల చర్మంలో ఉన్న బ్యాక్టీరియా బయటకు వస్తుంది. అందుకే ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
తేమను లాక్ చేస్తుంది
చర్మాన్ని మృదువుగా ఉంచుకోవాలంటే ఎప్పటికప్పుడు ఆవిరిని పడుతూ ఉండాలి. దీనివల్ల మీ చర్మం తేమగా కనిపిస్తుంది. అలాగే ఇది చర్మంలోని తేమను లాక్ చేస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మీ ముఖానికి 4 నుంచి 5 నిమిషాల ముందు ఆవిరి పట్టిస్తే చర్మంలో కొల్లాజెన్ స్థాయి కూడా పెరుగుతుంది.
ఫేస్ ఆవిరి వల్ల కలిగే సమస్యలు
ముఖం ఎర్రగా మారడం
ఎక్కువ సేపు ముఖానికి ఆవిరిని పట్టడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి. వీళ్లు ముఖానికి ఎక్కువ సేపు ఆవిరి పట్టకూడదు.
మంట
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ప్రకారం.. చాలా మందికి ముఖానికి ఆవిరి పట్టడం వల్ల మంట సమస్య వస్తుంది. ఇది చర్మంపై తామర, సోరియాసిస్, ఇతర తాపజనక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వేడి ఉష్ణోగ్రత రక్త నాళాలు విస్తరించడానికి కారణమవుతుంది.
డ్రైనెస్
ఇప్పటికే చర్మం పొడిగా ఉన్నవారు.. ముఖానికి ఆవిరి పట్టడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ చర్మం చర్మంలో ఉండే అదనపు నూనెను తగ్గిస్తుంది. దీనివల్ల మీ స్కిన్ మరింత పొడిబారుతుంది. అంతేకాదు చర్మంపై దద్దుర్లు కూడా ఏర్పడతాయి.
మొటిమల సమస్య
ముఖంపై మొటిమలు ఉన్న ఆడవారు కూడా ముఖానికి ఆవిరిని పట్టడం మానుకోవాలి. ఎందుకంటే ఆవిరి వల్ల చర్మ కణాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇది మొటిమలను పెంచుతుంది. అంతేకాదు మొటిమలు విపరీతంగా నొప్పి కూడా పెడతాయి.