Weight Loss Tips: బరువు పెరగకూడదంటే ఈ కూరగాయలను తప్పక తినాల్సిందే అంటున్న నిపుణులు..
Weight Loss Tips: బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఎందుకంటే వ్యాయామాలతో పాటుగా ఆరోగ్యకరమైనన ఆహారం ద్వారా కూడా సులువుగా బరువు తగ్గొచ్చు.

బరువు పెరగడం ఎంత సులువో.. అధిక బరువును కరిగించుకోవడం అంత కష్టం. బరువు తగ్గే ప్రాసెస్ లో ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అందులోనూ బెల్లీ ఫ్యాట్ ను వదిలించుకోవడం అంత సులువు కాదు.
ఈ అధిక బరువు, ఊబకాయం సమస్యలు ఒక మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుంటే ఈజీగా పొట్టుచుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
గుమ్మడికాయ.. గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని బరువు తగ్గించే ఆహారంగా భావిస్తుంటారు నిపుణులు. ఎందుకంటే గుమ్మడికాయ తినడం వల్ల బరువు తగ్గుతుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తొందరగా కరిగిస్తుంది.
బీన్స్.. బీన్స్ లో ఎన్నో పోషకాలుంటాయి. ఇది శరీరానికి పోషణను అందించడంతో పాటుగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు వెయిట్ లాస్ కు సహకరించడంతో పా టుగా కండరాల పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది మన జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
టొమాటో.. టొమాటో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే లైకోపీన్ జీవక్రియను పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే 9-ఆక్సో-ODA సమ్మేళనం రక్తంలోని లిపిడ్లను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
దోసకాయ.. దోసకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది కడుపును మొత్తం శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గుతారు.
బచ్చలికూర.. బచ్చలికూర చాలా ఆరోగ్యకరమైన ఆహారం. దీనిలో కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. అయితే బరువు తగ్గాలంటే బచ్చలికూరను ఎక్కువ నూనెలో వేసి ఉడికించకూడదు. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి.
బ్రోకలీ.. బ్రోకలీని పోషకాల నిదిగా భావిస్తారు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్స్, ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి ఎంతో సహాయపడతాయి. బ్రోకలీని సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.