MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • టీనేజ్ లో మొటిమలు కావొద్దంటే ఇలా చేయండి

టీనేజ్ లో మొటిమలు కావొద్దంటే ఇలా చేయండి

టీనేజర్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్ల మొటిమలు విపరీతంగా అవుతుంటాయి. వీటివల్ల ముఖం వాపు వస్తుంది. కొంతమంది వాటిని గిల్లుతారు కూడా దీనివల్ల అవి అలాగే మచ్చలు ఏర్పడతాయి. అందుకే ఈ వయసులో మొటిమలు తగ్గడానికి ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 21 2023, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
pimples

pimples

కౌమారదశలో శరీరంలో మార్పులు రావడం చాలా సహజం. కానీ ఇవి టీనేజర్లకు ఎన్నో సమస్యలను తెచ్చి పెడతాయి. ముఖ్యంగా వీరిలో వచ్చే హార్మోన్ల మార్పులు వల్ల వారి మానసిక ఆరోగ్యం, శరీర నిర్మాణం, చర్మంలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. దీనివల్ల మొటిమలు, నల్లమచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. అందుకే టీనేజర్లు తమ చర్మాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. మరి టీనేజర్లు ఎలాంటి చర్మ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

25

మొటిమలను తాకకూడదు

టీనేజర్లలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల మొటిమలు, ముఖంపై మచ్చలు అవుతుంటాయి. ఇది చాలా కామన్. అందుకే దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది తెలియక మొటిమలు తొందరగా పోవాలని వాటిని గిల్లుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇలా మొటిమలను తరచుగా తాకడం, గిచ్చడం వల్ల మచ్చలు అవుతాయి. అలాగే సంక్రమణ ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మొటిమలను అస్సలు తాకకండి. 

 

35

ముఖాన్ని కడగడం

టీనేజర్లు కుదురుగా ఉండరు. అంటే స్కూల్, కాలేజ్, ట్యూషన్స్, ఫ్రెండ్స్ అంటూ ఎప్పుడూ ఏదో ఒక దగ్గరికి వెళుతూనే ఉంటారు. బయట ఎక్కువగా తిరగడం వల్ల ముఖంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల  మొటిమలు ఏర్పడతాయి. అందుకే  మీరు ఉదయం, రాత్రిపూట మైల్డ్ క్లెన్సర్ తో రోజుకు రెండుసార్లు ముఖాన్ని క్లీన్ చేయండి. 
 

45

మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ 

మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లు చర్మ సంరక్షణకు చాలా అవసరం. అందుకే వీటిని ఖచ్చితంగా మీ చర్మ సంరక్షణలో చేర్చండి. మాయిశ్చరైజర్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీంతో చర్మం పొడిబారే అవకాశమే ఉండదు. ఇకపోతే సన్ స్క్రీన్ మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. ఈ యూవీ కిరణాలు నల్ల మచ్చలు, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
 

55

ఫేస్ యాక్టివ్ లను ఉపయోగించొద్దు

టీనేజర్ల చర్మం చాలా యవ్వనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో రెటినోల్, ఎహెచ్ఎ, బిహెచ్ఎ వంటి ఫేస్ యాక్టివ్స్ ను యూజ్ చేయడం వల్ల చర్మపు చికాకు వంటి సమస్యలు వస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే వీటిని అస్సలు ఉపయోగించకండి. అవసరమైతే డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే వీటిని ఉపయోగించండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
సౌందర్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Premium Rice: ప్ర‌పంచంలో అత్యంత ఖరీదైన బియ్యం ఇదే.. కిలో రైస్ ధ‌ర రూ. 12,000
Recommended image2
Trendy Bangles: అదిరిపోయే డిజైన్‍లో లక్క గాజులు.. ట్రై చేయకపోతే ఎలా?
Recommended image3
Crocs Health Risks: పిల్లలు వేసుకునే ఈ చెప్పుల్లో విషం..బయటపడ్డ అసలు నిజం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved