బీపీ పెషెంట్లు బనానా తింటే ఎన్ని లాభాలుంటాయో తెలుసా..?
Banana Benefits: అధిక రక్తపోటుతో బాధపడేవారు తరచుగా అరటిపండ్లను తినడం వల్ల బీపీ కంట్రోల్ అవ్వడమే కాదు.. ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. అంతేకాదు ఈ పండును తినడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది.

Banana Benefits: అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో కాల్షియం, పొటాషియం, విటమిన్లు, ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య జబ్బుల నుంచి దూరం చేస్తాయి. అంతేకాదు ఇవి ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు ఇందులో ఉండే కాల్షియం ఎంతో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న అరటిపండును బీపీ పేషెంట్లు తినొచ్చా? లేదా? అన్న అనుమానాలు కొందరిలో ఉంటాయి.
వాస్తవానికి అరటిపండును ఎలాంటి భయాలు పెట్టుకోకుండా బీపీ పేషెంట్లు తొనొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అరటిపండును తినడం వల్ల బీపీ కంట్రోల్ అవ్వడమే కాదు.. వారి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి కూడా అందుతుంది. మరి బనానా తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
బనానాలో కార్భోహైడ్రేట్లు అధిక మొత్తంలో ఉండటం వల్ల వీటిని తింటే కడుపు తొందరగా నిండిందన్న భావన కలుగుతుంది. దీంతో మీరు ఫుడ్ ను ఎక్కువగా తీసుకోలేరు. అయితే ఉదయం మీరు బ్రేక్ ఫాస్ట్ చేయకుంటే ఒక అరటిపండును తినండి. తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో మీరు ఎనర్జిటిక్ గా పనిచేస్తారు.
ఒత్తిడి తగ్గుతుంది.. అరటిపండులో ఒత్తిడిని తగ్గించే గుణాలుంటాయి. అరటిలో ఉండే ట్రిప్టోపాన్ అనే మూలకం హ్యాపీ హార్మోన్ (సెరోటోనిన్) రిలీజ్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.
జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి.. ఎవరైతే జీర్ణక్రియకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్నారో వారికి అరటి చక్కటి ఔషదంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో స్టార్చ్ ఉంటుంది. ఇది మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ అరటిపండు గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది.
ఎముకలు బలంగా ఉంటాయి.. అరటి పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా, ధ్రుడంగా చేసేందుకు ఎంతో సహాయపడుతుంది. కీళ్లనొప్పులు, పగుళ్లు వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక అరటిపండును తింటే ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.