Bakri Eid 2022: బక్రీద్ పండుగ ఎప్పుడు.. ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి..?
Bakri Eid 2022: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ ముస్లిం సోదరులకు ఎంతో ప్రత్యేకమైంది. పవిత్రమైంది. ఈ పండుగను ఈ ఏడాది జులై 10 న జరుపుకోనున్నారు.

బక్రీద్ పండుగ ముస్లీం లకు ఎంతో ప్రత్యేకమైంది. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఈ బక్రీద్ పండుగనే ‘ఖుర్బీనా పండుగ’ లేదా ఈద్ అల్-అధా అని కూడా పిలుస్తారు. రంజాన్ తర్వాత వచ్చే ఇస్లామిక్ క్యాలెండర్ లో ముఖ్యమైన నెలల్లో ఈ నెల ఒకటి.
బక్రీద్ పండుగ ప్రాముఖ్యత
ప్రవక్త ఇబ్రహీం తన కొడుకైన ఇస్మాయిల్ ను కత్తితో మెడను కోస్తున్నట్టుకు ఒక రోజు కళ వస్తే .. ఆ అల్లాహ్ తన కొడుకునే కోరుతున్నాడేమోనని భావించి.. తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్దపడతాడు. ఇబ్రహీం త్యాగాన్నిమెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగం వద్దని ఏదైనా జీవిని బలి ఇవ్వాలని కోరతాడు. ఇబ్రహీం భక్తికి, త్యాగానికి గుర్తుగా ఆయనను సత్కరించేందుకే ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ముందురోజు ముస్లింలంతా తమ పెద్దల సమాదుల దగ్గర వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను, బట్టలను పెడతారు. సర్గం నుంచి తమ పెద్దలు వాటిని స్వీకరిస్తారని వారు నమ్ముతారు.
గొర్రె పిల్లను ఎందుకు బలి ఇస్తారు..
ఇబ్రహీం భక్తితో అల్లాహ్ కు తన కొడుకును బలి ఇస్తుంటే.. అల్లాహ్ జోక్యం చేసుకుని కొడుకు స్థానంతో గొర్రెపిల్లను బలి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఇబ్రహీం తన కొడుకునే బలి ఇస్తున్నట్టు భావిస్తాడు. కానీ అల్లాహ్ మహిమ వల్ల బలి అయ్యింది గొర్రెపిల్ల.. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ అల్లాహ్ కు గొర్రెపిల్లను బలిఇస్తారు.
అల్లాహ్ కు నైవేద్యం సమర్పించిన తర్వాత గొర్రె పిల్లను మూడు భాగాలుగా చేసి.. కొంత భాగం కుటుంబానికి, ఇంకొంత భాగం స్నేహితులకు, ఇంకొంచెం పేదలకు, అవసరమైన వారికి పంచి పెడతారు. ఈ మాంసంతో మటన్ కీమ్, మటన్ కుర్మా, మటన్ బిర్యానీ, కీర్, షీర్ కుర్మా వంటి వంటకాలను విందుగా రెడీ చేసి ఆరగిస్తారు.
ఈద్ అల్-అధా తేదీ, సమయం
దేశవ్యాప్తంగా జులై 10 వ తేదీన బక్రీద్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. International Astronomical Centre ప్రకారం.. సౌదీ అరేబియాలో ఈ పండుగ జరిగిన తర్వాతి రోజున భారతదేశంలో ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈ, మొరాకో, ఈజిప్ట్ , ఒమన్ ల్లో ఈ ఏడాది జులై 9 న బక్రీద్ పండును జరుపుకోనున్నారు.