- Home
- Life
- High Cholesterol Control Tips: వీటిని తినడం మానేస్తే చాలు.. కొలెస్ట్రాల్ కరగడం మొదలవుతుంది..
High Cholesterol Control Tips: వీటిని తినడం మానేస్తే చాలు.. కొలెస్ట్రాల్ కరగడం మొదలవుతుంది..
High Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ తగ్గాలని నానా ప్రయత్నాలను చేస్తుంటారు. ఇలాంటి వారు ముందుగా చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఈ ఆహారాలను తినకుండా చూసుకోవాలి. అప్పుడే చెడు కొలెస్ట్రాల్ కరగడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.

High Cholesterol
కొలెస్ట్రాల్ సర్వ రోగాలకు కారణమవుతుంది. ఎవరైతే చెడు కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారో వారు.. అధిక బరువు (overweight), డయాబెటీస్ (Diabetes), గుండె జబ్బులు (Heart diseases), బెల్లీ ఫ్యాట్ (Belly fat), అధిక రక్తపోటు (high blood pressure)వంటి ఎన్నోఅనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ ఆయుష్షును కూడా తగ్గిస్తుంది.
High Cholesterol
అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి డైట్ ను ఫాలో అవ్వడం, ఆరోగ్యానికి చెడు చేసే పానీయాలను తాగకపోవడం వంటి వాటిని ఫాలో అవ్వాలి. జీవన శైలి కూడా బాగుండాలి. అంతేకాదు కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలను కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా వీళ్లు తమ రోజు వారి ఆహారంలో కొన్ని ఆహారాలను తినడం పూర్తిగా మానేయాలి. అప్పుడే చెడు కొలెస్ట్రాల్ (bad cholesterol) కరగడం మొదలవుతుంది. ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బిస్కెట్లు (Biscuits)
కొంతమంది బిస్కట్లను స్నాక్స్ గా తింటే ఇంకొంత మంది మాత్రం టీతో తినడానికి ఇష్టపడతారు. బిస్కెట్లు టేస్టీగా అనిపించినా ఇవి మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans fats) ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
Yellow butter
Yellow butter ను వివిధ రకాల వంటల్లో వేసుకుని తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది మనల్ని అనారోగ్యం పాలు చేస్తుంది. ఎందుకంటే దీన్నీ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా మనం మార్కెట్ లో కొనే ప్యాక్డ్ వెన్నలో Saturated fat అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని తినడం మానేసి.. తెల్లవెన్నను తినండి. ఇది శరీరానికి ఎలాంటి హాని చేయదు.
జిడ్డు ఆహారం (Oily food)
చాలా మందికి ఆయిలీ ఫుడ్స్ అంటేనే చాలా ఇష్టం. వీటినే ఇష్టంగా తింటుంటారు. కానీ ఇవి మన శరీరానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని విచ్చల విడిగా తినడం వల్ల ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ దారుణంగా పెరిగిపోతుంది. ఒకరకంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధానం కారణం కూడా ఈ ఆయిలీ ఫుడ్ యే. అందుకే ఇకనైనా ఇలాంటి ఆహారాలను తినడం మానేయండి. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. అప్పుడే మీ ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ ను కరిగించగలుగుతారు.
ఎర్ర మాంసం (Red meat)
రెడ్ మీట్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. కానీ దీనిని మోతాదుకు మించి తింటే మాత్రం శరీరంలో కొవ్వు దారుణంగా పేరుకుపోతుంది. అందుకే దీన్ని తినడం అంత మంచిది కాదు.
చక్కెర (Sugar)
షుగర్ మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో అంతకు మించి హాని కూడా కలిగించగలదు. ఎందుకంటే చక్కెర వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం తగ్గించడం మంచిది.