- Home
- Life
- Atukula Upma: మామూలు ఉప్మా బోర్ కొడితే అటుకుల ఉప్మా ఇలా టేస్టీగా చేసేయండి, రెసిపీ ఎంతో సింపుల్
Atukula Upma: మామూలు ఉప్మా బోర్ కొడితే అటుకుల ఉప్మా ఇలా టేస్టీగా చేసేయండి, రెసిపీ ఎంతో సింపుల్
సాధారణంగా మనలో ఎక్కువ మంది ఉప్మాను ఇష్టపడరు. అలాంటివారు అటుకుల ఉప్మా తినేందుకు ప్రయత్నించండి. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. నార్త్ ఇండియాలో దీన్ని పోహా ఉప్మా అంటారు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

అటుకుల ఉప్మా రెసిపీ
సాధారణ ఉప్మాతో పోలిస్తే పోహా ఉప్మా రుచిగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో దీన్ని పోహా అని పిలుచుకుంటారు. కానీ దక్షిణ భారత దేశంలో అటుకుల ఉప్మా అని అంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. పైగా చేయడం కూడా చాలా సులువు. సాధారణ ఉప్మా తో పోలిస్తే పోహా ఉప్మా అదిరిపోతుంది.
అటుకుల ఉప్మా రెసిపీ కి కావలసిన పదార్థాలు
రెండు కప్పుల అటుకులను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు సిద్ధం చేసుకోవాలి. రెండు స్పూన్ల నూనె, ఒక ఉల్లిపాయ, జీలకర్ర అర స్పూను, చిటికెడు పసుపు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, పల్లీలు గుప్పెడు, కొత్తిమీర తరుగు రెండు స్పూన్లు, కరివేపాకులు గుప్పెడు, పచ్చిమిర్చి తురుము రెండు స్పూన్లు, అల్లం తరుగు అర స్పూను సిద్ధం చేసుకోవాలి. ఆవాలు అర స్పూను, జీలకర్ర పావుస్పూను, పచ్చిశెనగ పప్పు అర స్పూను, మినప గుళ్ళు అర స్పూను తాళింపు కోసం పక్కన పెట్టుకోవాలి.
అటుకుల ఉప్మా ఇలా చేసేయండి
అటుకుల ఉప్మా చేసేందుకు ముందుగా అటుకులను నీటిలో వేసి రెండుసార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత చేత్తోనే పిండి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకులు వేసి వేయించాలి. తర్వాత పల్లీలు కూడా వేసి వేయాలి. అందులోనే అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలు తరుగు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలను, కొత్తిమీర తరుగును కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో రెండు కప్పుల నీటిని వేయాలి.
ఉప్మా సిద్ధం
నీరు మరుగుతున్నప్పుడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కడిగిన అటుకులను వేసి ఉడికించాలి. ఇది దగ్గరగా పొడి పొడిగా వచ్చేవరకు ఉడికించాలి. దీన్ని మీడియం మంట మీద ఉడికించడం ముఖ్యం. పెద్ద మంట పెడితే మాడిపోయే అవకాశం ఉంద. చివరలో కొత్తిమీర తరుగును మళ్లీ చల్లుకోవాలి. అంతే పోహా ఉప్మా రెడీ అయినట్టే. రుచి చూశారంటే వదల్లేరు.
ఎంతో ఆరోగ్యం కూడా
సాధారణ ఉప్మాను ఇష్టపడని వారు అటుకుల ఉప్మాను కచ్చితంగా ఇష్టపడతారు ఎందుకంటే. ఇది పొడిపొడిగా వస్తుంది. పైగా ఇందులో పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్లు ముక్కలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కలిపి టేస్టీ రుచిని అందిస్తుంది. ఒక్కసారి మీరు అటుకుల ఉప్మా చేసుకొని తిని చూడండి. అద్భుతంగా అనిపిస్తుంది.