MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • HandWash: మీరు తిన్న ప్లేటులోనే చేతులు కడుక్కుంటున్నారా? దాని వల్ల కలిగే ఫలితాలు ఇవే

HandWash: మీరు తిన్న ప్లేటులోనే చేతులు కడుక్కుంటున్నారా? దాని వల్ల కలిగే ఫలితాలు ఇవే

HandWash: మన సంస్కృతిలో ఆహారం దైవ స్వరూపం. ఆహారాన్ని అన్నపూర్ణా మాత రూపంగా కొలుచుకుంటారు. భోజనం తర్వాత తిన్న ప్లేట్లోనే చేతులు కడుక్కోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వాస్తు శాస్త్రం వివరిస్తోంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 30 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆహారం దైవస్వరూపం
Image Credit : Chat gpt

ఆహారం దైవస్వరూపం

హిందూమతంలో ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా చెప్పుకుంటారు. అలాగే ఆహారాన్ని అన్నపూర్ణా దేవి, లక్ష్మీదేవికి ప్రతికగా కొలుస్తారు. ఇంట్లో ఆహారాన్ని ఎంతగా గౌరవిస్తే అక్కడ సంపద అంతగా పెరుగుతుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. తిన్న తర్వాత అదే ప్లేటులోనే చేతులు కడుక్కుంటారు. అయితే ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆర్థిక సమస్యలను ఆహ్వానించినట్టేనని వాస్తు శాస్త్రం వివరిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇలా చేయవద్దు
Image Credit : Getty

ఇలా చేయవద్దు

కేవలం వాస్తు శాస్త్రమే కాదు జ్యోతిష్య శాస్త్రం కూడా తిన్న ప్లేట్లోనే చేతులు కడగడాన్ని అశుభంగా చెబుతున్నాయి. పళ్లెంలో నీళ్లు పోయడం వల్ల మిగిలిపోయిన ఆహారం కలుషితమవుతుంది. ఇది లక్ష్మీదేవికి కోపాన్ని తెప్పిస్తుంది. చేతులు కడుక్కోవడానికి పక్కన ప్రత్యేక పాత్రను పెట్టుకోవాలి లేదా లేచి వెళ్లి బయట కడుక్కోవాలి. చాలామంది మిగిలిపోయిన ఆహారాన్ని నేరుగా చెత్తబుట్టలో పడేస్తూ ఉంటారు. ఇది కూడా ఆహారాన్ని అగౌరవపరచడమే. మిగిలిపోయిన ఆహారాన్ని పేదలకు లేదా జంతువులకు పెట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ దాన్ని పారవేయడం వల్ల ఇంట్లో ఆహారం కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.

34
ప్లేటులో చేతులు కడిగితే వచ్చే ఫలితాలు
Image Credit : Getty

ప్లేటులో చేతులు కడిగితే వచ్చే ఫలితాలు

చాలామంది భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడడం, టీవీ చూడడం, ఫోన్లో మాట్లాడడం వంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల భోజనంపై ఏకాగ్రత ఉండదు. పరధ్యానంగా ఆహారాన్ని తినడం కూడా దానిని అవమానించడమే. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఇంట్లో అశాంతిని పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. భోజనాన్ని తినేటప్పుడు నిశ్శబ్దంగా తినాలి. కృతజ్ఞతతో ఆహారాన్ని ఆనందంగా స్వీకరించాలి. అలాగే మురికిగా ఉన్న కడగని పాత్రలలో కూడా ఆహారం తినడం వల్ల వాస్తు దోషాలు పెరిగిపోతాయి. ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. తినడానికి ముందు చేతులను కడుక్కోవాలి.

44
ప్లేటును వెంటనే క్లీన్ చేయాలి
Image Credit : Getty

ప్లేటును వెంటనే క్లీన్ చేయాలి

భోజనం చేశాక చాలామంది ఆ ప్లేటును అలా వదిలేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. పళ్లాన్ని వెంటనే శుభ్రం చేయాలి. ప్లేటులో ఆహారాన్ని మిగిల్చి ఉంచడం కూడా ఏమాత్రం మంచిది కాదు. ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలకు గొడవలకు దారి తీయవచ్చు. ఆహారాన్ని ప్రతిరోజూ ప్రసాదంగా భావించి తినాలి. ఇలా ఆహారాన్ని మీరు ఎంత గౌరవిస్తే మీ ఇంట్లో శాంతి, సంతోషం అంతగా నెలకు ఉంటాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!!
Recommended image2
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Related Stories
Recommended image1
Gardening: ఈ 5 ఆకుకూరల్ని కుండీల్లో ఈజీగా పెంచేయచ్చు.. 15 రోజుల్లోనే చేతికొస్తాయి
Recommended image2
Mango Pickle: మామిడి ఊరకాయ ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved