MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • గర్భ నిరోధక మాత్రలను ఉపయోగిస్తున్నారా? ఒకసారి ఈ విషయాలను తెలుసుకోండి..

గర్భ నిరోధక మాత్రలను ఉపయోగిస్తున్నారా? ఒకసారి ఈ విషయాలను తెలుసుకోండి..

contraceptive pills : ప్రస్తుత కాలంలో గర్భనిరోధక మాత్రలను వాడే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా ఈ ట్యాబ్లెట్లను ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉపయోగిస్తున్నారు. తొందరగా ప్రెగ్నెన్సీ రాకూడదనే ఉద్దేశంతో వాడే ఈ మాత్రల మూలంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 15 2022, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

contraceptive pills : ప్రస్తుత రోజుల్లో గర్భనిరోధక మాత్రల వాడకం బాగా పెరిగింది. ఈ మాత్రలను ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉపయోగిస్తున్నారట. అయితే ఈ మాత్రల వల్ల కలిగే లాభాల సంగతి పక్కన పెడితే.. వీటి వాడకం వల్ల ఎన్నో నష్టాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాత్రలను ఉపయోగించడం వల్ల శరీరకంగానే కాదు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ముఖ్యంగా హార్మోన్ అసమతుల్యత సమస్య వస్తుందని పేర్కొంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ethinyl estradiol, Synthetic estrogen, progesterone లు గర్బనిరోధక మాత్రల్లో ఉంటాయట. ముఖ్యంగా ఈ మాత్రల్లో ఉండే ethinyl estradiol వల్ల పిండం పెరగదు. అంతేకాదు ఈ టాబ్లెట్ల వాడకం వల్ల పీరియడ్స్ సమయంలో రక్తస్రావం అధికంగా కాకుండా చేస్తుంది. కానీ ఈ మాత్రల వల్ల కలిగే నష్టాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

38

గర్భనిరోధక మాత్రలను 1960 లో ప్రవేశపెట్టారు. వీటి వాడటం వల్ల గర్భం దాల్చకపోవడం వల్ల  తమ నియంత్రణలో ఉంటుందని భావిస్తున్నారు. కానీ వీటిని తరచుగా వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను గుర్తించలేకపోతున్నారు.  కొన్ని నివేధకల ప్రకారం.. ఇండియాలో ఏడాదికి 1.5 కోట్ల మందికి కంటే ఎక్కువ ఆడవారు గర్భస్రావాల బారిన పడుతున్నారట. కాగా వీళ్లల్లో 75 శాతం ఆడవారు డాక్టర్లను consultent చేయకుండానే గర్భనిరోధక మాత్రలను వాడుతున్నారట.

48

అధ్యయనాల ప్రకారం.. గర్భనిరోధక మాత్రలను వాడటం వల్ల వాంతులు, తీవ్రమైన తలనొప్పి, వికారం, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. అంతేకాదు నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అయ్యే ప్రమాదముందట. అలాగే ఈ నెలసరి సమయం పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

58

25 నుంచి 45 లోపు వయసున్న వారు ఈ గర్భనిరోధక మాత్రలను వేసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కౌమార దశలో వీటిని తరచుగా వాడితే వారి Reproductive system పై చెడు ప్రభావం పడుతుందట. అంతేకాదు Hormone levels ఉండని ఆడవారు గర్భనిరోధక టాబ్లెట్లను తీసుకుంటే చాలా ప్రమాదమని చెబుతున్నారు. ఈ మాత్రల వల్ల కొంత మంది ఆడవారు బరువు పెరుగుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

68

మధుమేహం, ఊబకాయం సమస్యలున్న వారు ఈ మాత్రలను వాడకూడదు. అలాగే స్మోకింగ్ చేసే ఆడవారు గర్భనిరోధక టాబ్లెట్లను వేసుకోవడం అంతగా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గుండెకు సంబంధిత రోగాలు, అధిక రక్తపోటు సమస్యలున్న వారు కూడా వీటిని వాడకూడదు. 

78

మీకు తెలుసా ఈ గర్భనిరోధక మాత్రలను 10 సంవత్సరాలకు పైనే తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 60 శాతం ఎక్కువుగా పెరుగుతుందట. కాగా ఫ్యామిలీలో ఎవరికైనా బ్లడ్ గడ్డకట్టిన వాళ్లుంటే ఆఫ్యామిలీలోని ఆడవారు ఈ మాత్రలను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 
 

88

గర్భనిరోధక మాత్రలను ఉపయోగించాలనుకుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యుడు సూచించిన మాదిరిగా ఉపయోగిస్తే ఎలాంటి అనర్థాలు జరగవు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved