ఈ ఒక్క పండును తింటే చాలు కొలెస్ట్రాల్ కరగడంతో పాటుగా.. గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది..
Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ ను ఎంత తొందరగా తగ్గిస్తే మీ ఆరోగ్యం అంత సేఫ్ గా ఉంటుంది. లేదంటే గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా ఇది ప్రాణాలను కూడా తీసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక పండు కొలెస్ట్రాల్ ను కరిగించడంతో పాటుగా గుండె పోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

High Cholesterol
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల ప్రాణాలే పోవచ్చు. ముఖ్యంగా గుండెపోటు (Heart attack), కొరోనరీ ఆర్టరీ డీసీజ్ (Coronary artery disease), ట్రిపుల్ వెసల్ డిసీజ్ (Triple vessel disease) వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వీలైనంత తొందరగా చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol)ను తగ్గించుకోవాలి.
కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు సహాయపడతాయి. అందులో ఆపిల్ (Apple) పండు ఒకటి. రెగ్యులర్ గా ఒక ఆపిల్ పండును తింటే కొలెస్ట్రాల్ చాలా ఫాస్ట్ గా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
High Cholesterol
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) స్థాయిలను తగ్గించడానికి ఆపిల్ పండు ఎంతో సహాయపడుతుంది. రోజుకు ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆపిల్ లో ఉండే పెక్టిన్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఆపిల్ చేసే మేలు.. ఆాపిల్ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంతో పాటుగా జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది.
ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. రోజుకు ఒక ఆపిల్ పండును తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపర్చడంతో పాటుగా, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆపిల్ పండ్లను ఎప్పుడు తినాలి.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే ప్రతి రోజూ ఉదయాన్నే ఆపిల్ పండ్లను తినాలి. ఈ పండ్లను జ్యూస్ గా చేసుకుని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.
ఇదీ కాకుండా కొంతమంది ఈ పండ్లను ఓట్స్ తో కలిపి కూడా తింటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే రుచిగా కూడా ఉంటుంది.