Anger Control Tips:కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసా..?
Anger Control Tips: కొంతమందికి ఏదో ఒక కారణం చేత కొపమొస్తొ.. మరికొంతమందికి మాత్రం అయిన దానికి కాని దానికి కోపమొస్తూనే ఉంటుంది. కోపం వల్ల మీకొచ్చేది ఏమీ ఉండదు.. అనారోగ్యం తప్ప..

Anger Control Tips:మనిషికి ఉన్న వివిధ భావోద్వేగాల్లో కోపం కూడా ఒకటి. ఈ కోపం సాధారణంగా ప్రతి ఒక్కరికీ వస్తుంటుంది. ఇది అంత పెద్ద విషయం కూడా కాదు. కానీ కొంతమందికి ఏదో బలమైన విషయానికే కోపం వస్తుంటుంది. అది కూడా ఎప్పుడో ఒకసారి.
కానీ కొంతమందికి మాత్రం అయిన దానికి కాని దానికి కోపం వస్తూనే ఉంటుంది. ఇది మహా చెడ్డది. ఈ అలవాటు వల్ల మీరు నలుగురిలో కోపిష్టిగానే మిగిలిపోవడమే కాదు.. మీతో ఎవరూ మాట్లాడే సాహసం కూడా చేయరు. అంతెందుకు మీ ఇంట్లో వారు కూడా మీతో ఫ్రీగా ఉండలేరు.
ఈ సంగతి పక్కన పెడితే.. కోపం వల్ల ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా రిలీజ్ అవుతాయి. దాంతో మీలో టెన్షన్ బాగా పెరిగిపోతుంది. అంతేకాదు బ్లడ్ ప్రెజర్ కూడా ఎక్కువ అవుతుంది. దీంతో మీకు బ్రెయిన్ హెమరేజ్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ రావొచ్చు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అత్యవసరం. లేదంటే ప్రాణాల మీదికి రావొచ్చు. మరి ఈ కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
యోగా చేయడం ద్వారా.. యోగాతో విపరీతమైన కోపాన్ని కూడా ఇట్టే కంట్రోల్ చేయొచ్చు. యోగాతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి ఒత్తడి నుంచి బయటపడాలననా.. కోపాన్ని కంట్రోల్ చేయాలన్నా క్రమం తప్పకుండా యోగాను చేయండి.
వ్యాయామం.. వ్యాయామం ద్వారా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కోపం వచ్చినట్టు అనిపించినప్పుడల్లా చిన్నపాటి నడకను మొదలుపెట్టండి. దీనివల్ల ఒత్తిడి హార్మోన్లు రిలీజ్ కావు. దాంతో మీకు కోపం రాదు.
meditation
ధ్యానం.. నిత్యం ధ్యానం చేయడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా ధ్యానం చేయండి.
breathe
గట్టిగా ఊపిరి పీల్చుకోండి.. కోపంతో వచ్చినప్పుడల్లా ముందుగా మీరు చేయాల్సిన పని గట్టిగా ఊపిరి పీల్చి బయటకు వదలండి. కొద్ది సేపటిదాకా ఇలా చేయడం ద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది. కోపం కూడా కంట్రోల్ కి వస్తుంది.
సంగీతం వినండి.. ఒత్తిడి నుంచి బయటపడటానికి సంగీతం బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది. మనసుకు నచ్చిన పాటలను వినడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మీకు కోపం వచ్చినప్పుడల్లా నచ్చిన పాటలు వింటూ దాన్ని డైవర్ట్ చేయండి. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.