MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పొడవైన జుట్టు కావాలా? అయితే ఇలా చేయండి

పొడవైన జుట్టు కావాలా? అయితే ఇలా చేయండి

జుట్టు సంరక్షణలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. చుండ్రు కూడా వస్తుంది. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ జుట్టు బలంగా, పొడుగ్గా పెరుగుతుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 11 2023, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
hair care

hair care

స్ట్రాంగ్, పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది. అందుకోసం ఎన్నెన్నో చేస్తుంటారు. కానీ ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జుట్టు సంరక్షణలో చిన్న అజాగ్రత్త కూడా ఎన్నో జుట్టు సమస్యలను కలిగిస్తుంది. అయితే మీరు కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మీ జుట్టు అందంగా, పొడుగ్గా పెరుగుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే?

28
hair care

hair care

తలకు మసాజ్

రోజూ కాసేపు తలకు మసాజ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. అందులో గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేయండి. ఇది మీ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే జుట్టు వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.

38
hair care

hair care

తలస్నానం

తలకు నూనె రాసుకుని స్నానం చేయడం అలవాటు చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయండి. ఇది జుట్టు సహజత్వాన్ని నిర్వహించడానికి, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. 
 

48
hair care

hair care

అవసరమైన పోషకాలు

జుట్టు పెరిగేందుకు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఖచ్చితంగా తినండి. ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఆకుకూరలు, బీన్స్, చిన్న చేపలు, చికెన్ లో మీ జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

58
hair care

hair care

హెయిర్ కట్టింగ్

జుట్టును కత్తిరించుకోవడం వల్ల కూడా మీ జుట్టు బాగా పెరుగుతుంది. ప్రతి మూడు నెలలకోసారి జుట్టును కత్తిరించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టు చివరలు విచ్ఛిన్నం కాకుండా నిరోధిస్తుంది. దీంతో మీ జుట్టు బాగా పెరుగుతుంది. 
 

68
hair care

hair care

షాంపూ

ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు తెలుసా..? షాంపూను వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉపయోగించాలి. షాంపూ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడానికి సహాయపడే సహజ నూనె తగ్గిపోతుంది. షాంపూ చేసిన తర్వాత కండీషనర్ వాడటం మర్చిపోకండి. 
 

78
hair care

hair care

దువ్వడం

స్నానం చేసిన వెంటనే జుట్టును ఎట్టి పరిస్థితిలో దువ్వకండి. ఎందుకంటే తడిగా ఉన్న జుట్టును దువ్వడం వల్ల జుట్టు బాగా రాలిపోతుంది. అలాగే హెయిర్ డ్రయ్యర్ తో జుట్టును ఆరబెట్టే అలవాటు కూడా మంచిది కాదు.
 

88
hair care

hair care

హెయిర్ మాస్క్

నేచురల్ హెయిర్ మాస్క్ లను తయారు చేసే ముందు జుట్టు స్వభావంపై కూడా అవగాహన ఉండాలి. కొన్నిసార్లు మీరు ఎంచుకున్న వస్తువులు మీ జుట్టు స్వభావానికి ఏమాత్రం సరిపోకపోవచ్చు. ఇలాంటి ప్రయోగాలు జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image2
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Recommended image3
Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved