MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Almond Side effects: ఈ సమస్యలున్న వారు బాదం పప్పులను అస్సలు తినకూడదు..

Almond Side effects: ఈ సమస్యలున్న వారు బాదం పప్పులను అస్సలు తినకూడదు..

Almond Side effects: బాదం పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది బాదం పప్పులను బాగా తింటూ ఉంటారు. ఈ పప్పుల్లోప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా మారుస్తాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు బాదం పప్పులను  అస్సలు తినకూడదు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 05 2022, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Almond Side effects: బాదం పప్పుల్లో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్, కొవ్వు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు ఈ పప్పుల్లో ఫైబర్ కూడా మెండుగా లభిస్తుంది. ప్రతి రోజూ బాదం పప్పులను తినడం వల్ల మనన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ప్రమాదకరమైన గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ నివారణలో ఈ బాదం పప్పులు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా మధుమేహ రోగులకు ఇది హెల్తీ స్నాక్స్ గా ఉపయోగపడతాయి. 

27


బాదం పప్పులను తినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ రోగం ప్రమాదాన్ని కూడా ఈ బాదం పప్పులు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మతిమరుపు సమస్యను కూడా ఈ బాదం పప్పులు తగ్గిస్తాయి. అంతేకాదు శరీర బరువును తగ్గించడంలో కూడా బాదం బాగా సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. బాదం పప్పును తినడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అంతే మొత్తంలో నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

37

హై బీపీ సమస్యతో బాధపడేవారు బాదం పప్పులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ హైబీపీ వ్యాధిగ్రస్తులు వారి బీపీని తగ్గించుకోవడానికి మెడిసిన్స్ ను వాడుతుంటారు. కాబట్టి అలాంటి వారు మందులను వాడుతూ.. బాదం పప్పులను తినడం ఆరోగ్యానికి హానికరం. 

47

కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు బాదం పప్పులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్న వారు వాటిని తింటే.. ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే కిడ్నీల్లో రాళ్లున్న వారు బాదం పప్పులను అస్సలు తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 

57

జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు కూడా బాదం పప్పులను తినకూడదు. ఎందుకంటే ఈ బాదం పప్పుల్లో విటమిన్లు, ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. వాటిని తినడం వల్ల ఫుడ్ తొందరగా అరగదు. 
 

67

బాదం పప్పుల్లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఎసిడీటీ సమస్య ఉన్న వారు వీటిని తినకూడదు. ఒక వేళ వీటిని తింటే.. గ్యాస్, అజీర్థి వంటి సమస్యలు మరింత అధికమవుతాయి.

 

77

వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు బాదం పప్పులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పప్పుల్లో కొవ్వు శాతం, క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇక వీటిని తింటే ఇంకా బరువు పెరిగే ప్రమాదముంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు బాదం పప్పులను తినకూడదు.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silent People Psychology: సైలెంట్‌గా ఉండే వాళ్లు నిజంగా స్ట్రాంగ్‌గా ఉంటారా? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
Mangoes: మామిడిపళ్లు ఏడాదిపాటు తినాలంటే..ఇలా చేయాలి.
Recommended image3
Fenugreek Leaves: మెంతాకులు సంవత్సరం పొడువునా ఎలా స్టోర్ చేయాలో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved