త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా..? ఈ టిప్స్ కాస్త గుర్తుంచుకోండి..!
అది మీకు ఒకింత ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. కాబట్టి... బాగా కావాల్సిన వారిని మాత్రమే పెళ్లికి పిలుచుకోవడం ఉత్తమం. అప్పుడు ఎలాంటి చిక్కులు ఉండవు.

పెళ్లి జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకే.. పెళ్లి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు చాలా ప్రశాంతంగా.. ఆనందంగా, సంబరంగా గడపాలని అనుకుంటూ ఉంటారు. అయితే... ఎంతో ఆనందంగా గడపాల్సిన ఈ రోజున చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురౌతూ ఉంటారు. ఆ ఒత్తిడి లేకుండా.. ఆనందంగా పెళ్లి వేడుక జరగాలి అంటే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...
భారతీయ వివాహాలు దాదాపు చాలా గ్రాండ్ గా జరుగుతుంటాయి. 500-1000 మందికి పైగా అతిథులను ఆహ్వానిస్తూ ఉంటారు. కొన్నిసార్లు, సంఖ్య మరింత పెరుగుతూనే ఉంటుంది. అలా అతిథులు పెరగడం వల్ల కూడా.. ఏవైనా సమస్యలు రావచ్చు. అది మీకు ఒకింత ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. కాబట్టి... బాగా కావాల్సిన వారిని మాత్రమే పెళ్లికి పిలుచుకోవడం ఉత్తమం. అప్పుడు ఎలాంటి చిక్కులు ఉండవు.
ఇక మీ పెళ్లికి మీ మాజీ లను పిలవకపోవడమే మంచిది. సడెన్ గా వారు కనపడితే.. మీ మూడ్ డిస్టర్బ్ అయ్యే అవకశం ఉంది. కాబట్టి.. వారిని పిలవకుండా ఉంటే ఉత్తమం. మీరు పెళ్లి రోజున మీ జీవితంలోకి వచ్చే వ్యక్తిపై దృష్టి పెట్టాలి. ఏ సమస్య రాకుండా ఉండేలా ముందుగానే స్నేహితులతో, కుటుంబసభ్యులతో చర్చలు జరపడం ఉత్తమమైన మార్గం.
వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఈ రోజుల్లో పెద్ద డిమాండ్ ఉంది. ఎందుకంటే వ్యక్తులు తమ పెళ్లి రోజు జ్ఞాపకాలను ఫోటోగ్రాఫ్‌లలో బంధించాలని అనుకుంటారు.
మీ పెళ్లి రోజు న మీరు కూడా ఫోటోగ్రఫీ టీమ్‌ని బుక్ చేసుకున్నట్లయితే, మంచి పోజులివ్వడం మర్చిపోవద్దు. పెళ్లి రోజు గందరగోళం మధ్య మీరు అలా చేయడం మర్చిపోవచ్చు. అలా కాకుండా.. ప్రశాంతంగా ఫోటోలు దిగేలా ప్లాన్ చేసుకోవాలి.
మీ వివాహంలో మీ అతిథులు ముఖ్యమైన భాగం. వారిని అభినందించడం గుర్తుంచుకోండి. ఒక నిమిషం పాటు తేలికపాటి సంభాషణలో పాల్గొనండి, తద్వారా ప్రతి ఒక్కరూ మంచి అభిప్రాయంతో పెళ్లిని చూసి.. మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
వివాహాన్ని ఎదుర్కోవటానికి సులభమైన, ఒత్తిడి లేని మార్గం మీ పక్కన వివాహ ఈవెంట్ ప్లానర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. వారు మీకు ఎలాంటి ఒత్తిడి లేదా ఆందోళన కలిగించకుండా వృత్తిపరమైన, క్రమపద్ధతిలో మీ కోసం అన్ని పనులను చేస్తారు.