MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Skin care: వంకాయ తప్ప అన్నీ ముఖానికి రాసేస్తుంది.. అందుకే అంత అందం

Skin care: వంకాయ తప్ప అన్నీ ముఖానికి రాసేస్తుంది.. అందుకే అంత అందం

Skin care: అందాన్ని పెంచే పదార్థాలన్నీ మన ఇంట్లోనే ఉన్నా కూడా క్రీములు, కాస్మోటిక్స్ వాడేవారు ఎక్కువ. అయితే అదిరిరావు మాత్రం ఇంట్లో దొరికే కూరగాయలు, పండ్లు ముఖానికి రాస్తానని వివరిస్తోంది. అవే సహజ అందాన్ని ఇస్తాయని అంటోంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 18 2026, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంట్లో దొరికే పదార్థాలే
Image Credit : Aditi rao hydari /Instagram

ఇంట్లో దొరికే పదార్థాలే

అందంగా మెరిసిపోయేందుకు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతారు అమ్మాయిలు. కానీ నటి అదితిరావు హైదరి రూటే వేరు. ఆమె ముఖం ఎప్పుడూ సహజమైన మెరుపుతో కనిపిస్తుంది.ఆమె అందం వెనుక ఉన్న రహస్యం మాత్రం చాలా సింపుల్. ఇంట్లో దొరికే సహజ పదార్థాలు, మంచి అలవాట్లే ఆమె చర్మం మెరుపుకు కారణం. అదితి స్కిన్‌కేర్‌లో ఇంట్లో దొరికే సహజ పదార్థాలను అధికంగా వినియోగిస్తుంది. ఆమె తరచూ తేనె, పసుపు, పెరుగు, శెనగపిండి, అలొవెరా వంటి పదార్థాలతో ఫేస్‌ప్యాక్‌లు తయారు చేసుకుని వాడుతుంది. ఈ పదార్థాలు చర్మానికి తేమను అందించి, మృదువుగా మారుస్తాయి. అలాగే చర్మంపై ఉన్న మచ్చలు, మురికి పోయేందుకు సహాయపడతాయి. రసాయనాలున్న క్రీములు కాకుండా ఇంటి చిట్కాలను ఆమె ఎక్కువగా ఫాలో అవ్వడం వల్లే ఆమె చర్మం తాజాగా కనిపిస్తుంది.

24
పచ్చి పాలతో
Image Credit : Aditi rao hydari/Instagram

పచ్చి పాలతో

అదితి అప్పుడప్పుడు ముఖాన్ని పచ్చి పాలతో లేదా సున్నితమైన సహజ క్లీన్సర్‌తో క్లీన్ చేసుకుంటుంది. పాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. చర్మంపై ఉన్న దుమ్ము, మురికిని తొలగించడంలో సహాయపడతాయి. దీంతో ముఖం సహజ కాంతిని పొందుతుంది. రోజూ రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకోవడం ఆమె అలవాటు అంటున్నారు. చర్మ హైడ్రేషన్‌ కూడా ఆమె ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. రోజంతా తగినంత నీరు తాగుతారు.నీరు తక్కువగా తాగితే చర్మం పొడిబారుతుంది. అందుకే ఆమె సాధ్యమైనంత వరకు నీరు, కొబ్బరి నీరు వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకుంటారని చెబుతున్నారు. శరీరానికి తేమ అందితే అది ముఖంపై కూడా కనిపిస్తుంది.

Related Articles

Related image1
Tamannaah: విజయ్ దేవరకొండకు మాత్రమే లిప్‌లాక్ ఇస్తా.. తమన్నా కామెంట్స్
Related image2
Rajinikanth: రజినీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒకేఒక్క సినిమా ఏదో తెలుసా?
34
ప్రత్యేకమైన్ ఫేస్ ప్యాక్
Image Credit : Aditi rao hydari/Instagram

ప్రత్యేకమైన్ ఫేస్ ప్యాక్

చిన్నప్పటి నుంచి ఆమెకు శెనగ పిండి, పాలు, కొద్దిగా నూనె, పసుపు వేసి పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. మృత కణాలను తొలగిస్తుంది. చర్మం నెమ్మదిగా మెరుస్తూ ఉంటుంది. మేకప్ విషయంలో కూడా ఆమె జాగ్రత్తగా ఉంటారు. షూటింగ్‌లు లేకపోతే మేకప్ వేసుకోదు. రాత్రి పడుకునే ముందు మేకప్ పూర్తిగా తొలగించుకోవడం ఆమె తప్పనిసరిగా పాటించే అలవాటు. కొన్నిసార్లు సహజ నూనెలతో ముఖానికి మసాజ్ చేయడం చేస్తుంది.

44
కూరగాయలు, పండ్లతో మసాజ్
Image Credit : Aditi rao hydari/instagram

కూరగాయలు, పండ్లతో మసాజ్

ఆహారం కూడా చర్మ ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వంటివి చేస్తుంది అదితి. అలాగే కూరగాయ అయినా, పండు తొక్క అయినా దొరికితే దాంతోనే చర్మంపై మసాజ్ చేసుకుంటుంది. దీని వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. ఆమె బయట ఫుడ్ తినేందుకు ఇష్టపడదరు. ఇంటి వంటకాలకే ప్రాధాన్యత ఇస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 2 గ్రాముల్లో స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
Recommended image2
Health: క‌డుపులో గ్యాస్‌కి త‌ల‌నొప్పికి మ‌ధ్య‌ ఉన్న‌ సంబంధం ఏంటో తెలుసా.?
Recommended image3
Mangalsutra Necklace: నెక్లెస్‌లా కనిపించే ట్రెండీ మంగళసూత్రం
Related Stories
Recommended image1
Tamannaah: విజయ్ దేవరకొండకు మాత్రమే లిప్‌లాక్ ఇస్తా.. తమన్నా కామెంట్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒకేఒక్క సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved