MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Rajinikanth: రజినీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒకేఒక్క సినిమా ఏదో తెలుసా?

Rajinikanth: రజినీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒకేఒక్క సినిమా ఏదో తెలుసా?

Rajinikanth: రజినికాంత్ స్టార్ హీరో. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా ఎన్నో భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే ఒక సినిమాకు రజినీకాంత్ రెండు రోజుల పాటూ దర్శకుడిగా పనిచేశారు. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 18 2026, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బస్ కండక్టర్ నుంచి స్టార్ హీరో
Image Credit : x

బస్ కండక్టర్ నుంచి స్టార్ హీరో

బస్ కండక్టర్‌గా జీవితం మొదలుపెట్టారు రజినీకాంత్. ఆ తర్వాత అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు.1975లో 'అపూర్వ రాగంగళ్' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో పాత్రలలో నటించారు. 170కి పైగా సినిమాలు నటించి సూపర్ స్టార్ గా మారారు. ఆయన 'బాబా', 'వల్లి' లాంటి కొన్ని సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రాశారు. అలాగే 'మన్నన్' సినిమాలో 'అడిక్కుదు కుళిరు' అనే ఒక్క పాటను మాత్రమే రజినీ తన సొంత గొంతుతో పాడారు. అయితే ఆయన ఒక సినిమాకు రెండు రోజుల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రజినీకాంత్ దర్శకత్వం చేసిన సినిమా
Image Credit : x

రజినీకాంత్ దర్శకత్వం చేసిన సినిమా

రజినీకాంత్ పూర్తిస్థాయి దర్శకుడిగా ఏ సినిమాకు పనిచేయలేదు. కానీ ఒక సినిమాకు మాత్రం రెండు రోజుల దర్శకుడిగా పనిచేశాడు. ఆ సినిమా 1988లో వచ్చిన 'గురు శిష్యన్'. ఇది తమిళ సినిమా. ఇందులో రజినీకాంత్, ప్రభు, గౌతమి, సీత నటించారు. రజినీకి ఎన్నో హిట్లు ఇచ్చిన ఎస్.పి. ముత్తురామన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం రజినీకాంత్ 25 రోజుల కాల్షీట్ ఇచ్చారు. సినిమాలోని పాటల చిత్రీకరణను మైసూరులోని బృందావన్ గార్డెన్స్‌లో తీస్తున్నారు. అక్కడ రజినీ, గౌతమిపై ఒక పాటను చిత్రీకరించిన తర్వాత, రెండో హీరో ప్రభు, సీతపై మరో పాటను షూట్ చేయడం మొదలుపెట్టారు.

34
రెండు రోజులు వృథా కాకుండా
Image Credit : x

రెండు రోజులు వృథా కాకుండా

ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభు, సీతపై పాట షూటింగ్ జరగాల్సి ఉంది. రజినీకాంత్ తన గదిలోనే షూటింగ్ లేకుండా ఖాళీగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇది గమనించిన దర్శకుడు ఎస్.పి. ముత్తురామన్ 'వీరు  కావాలంటే చెన్నై వెళ్లి రండి. నేను ఈలోపు ఈ పాట పూర్తి చేస్తాను' అని చెప్పారు. దానికి రజినీ  'నేను మీకు 25 రోజులు కాల్షీట్ ఇచ్చాను. ఈ రెండు రోజులను మీరు వృథా చేయకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి' అని చెప్పారు.

44
ఖాళీగా ఉండలేక దర్శకత్వం
Image Credit : x

ఖాళీగా ఉండలేక దర్శకత్వం

ఎస్.పి. ముత్తురామన్ వెళ్లి రమ్మని చెప్పిన రజినీకాంత్ వెళ్లలేదు.  మరుసటి రోజు ప్రభు, సీత పాట షూటింగ్ సెట్‌కు రజినీకాంత్ వెళ్లారు. 'నేను జీతం తీసుకుని రూమ్‌లో ఖాళీగా కూర్చోవాలనుకోవడం లేదు. అందుకే, ఈ రోజు, రేపు నాకు ఏదైనా పని చెప్పండి. నేను చేస్తాను' అని రజినీ దర్శకుడిని అడిగారు.

దర్శకుడు ఎస్.పి. ముత్తురామన్, 'మీకు ఏ పని నచ్చితే అది చేయొచ్చు' అని అన్నారు. వెంటనే రజినీ 'నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తాను' అని చెప్పారు. ఆ తర్వాత ఆ రెండు రోజులు ప్రభు, సీతపై చిత్రీకరించిన 'వా వా వంజి ఇలమానే...' పాటకు రజినీకాంత్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తరువాత ఎప్పుడూ ఆయన దర్శకుడిగా పనిచేయలేదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image2
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image3
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Related Stories
Recommended image1
Tamannaah: విజయ్ దేవరకొండకు మాత్రమే లిప్‌లాక్ ఇస్తా.. తమన్నా కామెంట్స్
Recommended image2
Rahu Gamanam: రాహు సంచారంతో ఈ 4 రాశుల వారికి రాజభోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved