Summer : ఏసీ వాడకపోయినా పాడైపోతుందా?
ఎండాకాలం వచ్చింది అంటే చాలు ఏసీ వాడాల్సిందే. అయితే, సమ్మర్ లో ఏసీ వాడే ముందు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. అవేంటో చూద్దామా...

ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో ఎండలు మండిపోతూ ఉంటాయి. కాబట్టి, ఆ వేడిని తట్టుకోవడానికి ఏసీ వాడుతూ ఉంటాం. ఇది చాలా కామన్. కానీ.. వర్షాకాలం, చలికాలంలో వాడకుండా ఉంచిన ఏసీని.. సమ్మర్ లో వాడే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, చాలా కాలంపాటు ఏసీ వాడకుండా ఉండటం వల్ల కూడా అది పాడయ్యే అవకాశం ఉంది.
ఏసీ గ్యాస్ లీక్
సమ్మర్ లో ఏసీ వాడాలి అంటే, ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీని ఎక్కువ కాలం మంచిగా ఉంచాలంటే రెగ్యులర్ సర్వీసింగ్ చేయాలి. ఏసీ నుంచి మంచి చల్లదనం రావాలంటే గ్యాస్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసి నింపాలి.
ఏసీలో ఇంకో సమస్య
ఏసీలో గ్యాస్ తరచుగా లీక్ అయితే అది పెద్ద సమస్యకు దారితీయొచ్చు. అంటే ఏసీ మార్చాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. ఏసీలో గ్యాస్ లీక్ అవుతుంటే అది పెద్ద సమస్యే. ఇదే సమస్య కంటిన్యూ అయితే ఏసీ మార్చాల్సి ఉంటుంది. ఏసీలో గ్యాస్ ఛార్జ్ చేసినా చల్లటి గాలి రాకపోతే అది వేరే సమస్యకు సంకేతం కావచ్చు.
పాత ఏసీ
మీ ఏసీ బాగా పాతదైతే అంటే 10 నుంచి 15 ఏళ్లు దాటితే గ్యాస్ లీక్ సమస్య కామన్. పాత ఏసీని మెయింటైన్ చేయడం ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఇలాంటి టైంలో కొత్త ఏసీ కొనడం ఒక్కటే మార్గం.
గ్యాస్ లీక్ సమస్య
సంవత్సరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు ఏసీలో గ్యాస్ లీక్ అయితే అది మీ ఏసీలో పెద్ద సమస్య రాబోతోందని చెప్పడానికి సంకేతం కావచ్చు. ఏసీ మంచిగా ఉంటే గ్యాస్ లీక్ లేకుండా సంవత్సరాల తరబడి బాగా పనిచేస్తుంది. మీరు ఏసీలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే కొత్త ఏసీ కొనండి. దానివల్ల మంచి చల్లటి గాలి వస్తుంది, కరెంటు ఆదా అవుతుంది, మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.
ఇవన్నీ కచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. అంతేకాదు, వేసవిలో ఏసీ వాడే ముందు దానిని క్లీన్ చేసి వాడుకోవడం చాలా ముఖ్యం.