ఏసీ ఎంత వాడినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలా..? ఇవిగో ఐడియాలు..
ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు తెగ వాడేస్తుంటాం. మరి వాడకం ఎక్కువైతే.. బిల్లు వాచిపోవడం సహజమే కదా! కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు. అదెలాగంటారా.. ఇదిగో ఈ కథనం చదివేయండి మరి.

ఇలా చేస్తే కరెంట్ ఆదా
ఎండ అంటేనే చాలామందికి భయం. వాళ్లు ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికే జంకుతారు. ఈ ఎండల నుంచి రిలీఫ్ కోసం ఫ్యాన్, కూలర్, ఏసీ ఎడాపెడా వాడేస్తుంటారు. మరోవైపు కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుందనేది చాలామంది భయం. ముఖ్యంగా ఏసీల వాడకం వల్ల కరెంట్ బిల్లు బాగా ఎక్కువ వస్తుంది.
కరెంటు బిల్లు భయమొద్దు
ఎండ నుంచి తప్పించుకోవడానికి AC వాడితే ఆ నెల కరెంట్ బిల్లు వేడి గాలి కంటే ఎక్కువ వస్తుంది. దీనితో ఏం చేయాలో తెలియక జనాలు కష్టపడుతున్నారు. ఒకవైపు ఎండ, వేడి గాలిని తట్టుకోలేరు... ఇంకోవైపు కరెంట్ బిల్లును కూడా సహించలేరు. అలాంటి వాళ్ళు ఏసీ యూజ్ చేసినా కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.
ఇవి చేయండి
ఏసీని ఎప్పుడూ 24 డిగ్రీలలో సెట్ చేసి వాడితే కరెంట్ ఆదా అవుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఏసీని ఆఫ్ చేయాలి. దాంతోపాటు మీకు ఎప్పడు ఏసీ అవసరమో దానికి అనుగుణంగా టైమర్ సెట్ చేసుకోవాలి. అంటే అవసరం ఉన్నంత సేపు ఆన్‌లో ఉంచి ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా టైమ్ సెట్ చేయాలి. దానివల్ల ఏసీ యూసేజ్ తక్కువ అవుతుంది. ఇవన్నీ చేస్తుంటే తప్పకుండా మీ కరెంటు బిల్లు గణనీయంగా తగ్గుతుంది.
ఏసీని రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయించడం వల్ల దాని పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఏసీని తక్కువ టెంపరేచర్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా కూడా విద్యుత్ బర్డెన్ తక్కువ అవుతుంది.