గులాబీ, మందార, మల్లె, బొండు మల్లె, డాలియా, బోగన్‌విల్లా వంటి పూల మొక్కలను నర్సరీలో కొనక్కర్లేదు. విత్తనాలు వేయక్కర్లేదు. కేవలం కొమ్మ నాటితే చాలు పెరిగేస్తాయి.
మనీ ప్లాంట్ వంటి తీగజాతి మొక్కను చిన్న కొత్త కత్తిరించి మట్టిలోనో, లేక నీటిలోనే పెడితే చాలు అవి కొత్త మొక్కగా మారిపోతుంది. స్నేక్ ప్టాంట్ కూడా అంతే.
అయితే కొమ్మను నాటేటప్పుడు 4 నుంచి 6 అంగుళాల పొడవు ఉండేలా చూసుకోవాలి. రెండు మూడు కణుపులు ఉన్న కొమ్మను ఎంపికచేసుకోవాలి.
కొమ్మను నాటే ముందు కొమ్మ కింది భాగంలో ఉన్న ఆకులను తీసేయాలి. కొమ్మను నిలువుగా కాకుండా, ఒక వైపుకు ఏటవాలుగా (క్రాస్‌గా) కత్తిరించాలి.
కత్తిరించిన కొమ్మను నీటిలో లేదా తేమగా ఉన్న మట్టిలో నాట నీడగా, కాంతి తగిలే చోట పెట్టాలి.
మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. అలాగని ఎక్కువ నీరు పోయకూడదు. సాధారణంగా పది రోజుల్లో వేర్లు రావడం మొదలవుతుంది.
నర్సరీలో గులాబీ మొక్కలను ఇలానే అధికంగా పెంచుతారు. మీరు ఇంట్లో కూడా ప్రయత్నించవచ్చు.
Dandruff: చుండ్రుతో విసిగిపోయారా? ఈ చిట్కాలతో ఈజీగా వదిలించుకోండి
Gardening: ఈ మొక్కలు పెంచడానికి కొమ్మలు ఉంటే చాలు..!
Semiya Upma: సేమియా ఉప్మా పొడిపొడిగా రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి
Trendy Earrings: గుండ్రటి ముఖానికి సూపర్‍గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్