MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • AC: ఏసీ పేలిపోకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..

AC: ఏసీ పేలిపోకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..

AC: ఎండలు ముదురుతున్న వేళ ఏసీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, ఏసీని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అది పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 22 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎయిర్ ఫిల్టర్ల శుభ్రత   మన చేతిలోని పని
Image Credit : Getty

ఎయిర్ ఫిల్టర్ల శుభ్రత - మన చేతిలోని పని

ఏసీ మెయింటెనెన్స్‌లో అత్యంత ముఖ్యమైనది ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేయడం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీలోని ఫిల్టర్లను తీసి సాధారణ నీటితో కడగాలి. ఫిల్టర్లపై దుమ్ము పేరుకుపోతే గాలి సరిగ్గా రాక, కూలింగ్ తగ్గిపోవడమే కాకుండా కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది. ఫిల్టర్లను కడిగిన తర్వాత ఎండలో పెట్టకుండా, కేవలం తుడిచి మళ్ళీ అమర్చుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏసీ పేలిపోవడానికి ప్రధాన కారణాలు
Image Credit : Freepik

ఏసీ పేలిపోవడానికి ప్రధాన కారణాలు

ఏసీలు పేలిపోవడం అనేది అపోహ కాదు, అది వాస్తవం. దీనికి ప్రధాన కారణం నైపుణ్యం లేని టెక్నీషియన్లతో పనులు చేయించుకోవడం. ఏసీలో వాడే గ్యాస్ ఎల్‌పిజి లాగే చాలా ప్రమాదకరమైనది. గ్యాస్ లీక్ అయినప్పుడు పక్కాగా వ్యాక్యూమ్ చేయకుండా గ్యాస్ నింపితే ఏసీ పేలిపోయే అవకాశం 100 శాతం ఉంటుంది. అందుకే తక్కువ ధరకు వస్తున్నారని నకిలీ టెక్నీషియన్లను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

35
గ్యాస్ లీకేజీని గుర్తించడం ఎలా?
Image Credit : Pixabay

గ్యాస్ లీకేజీని గుర్తించడం ఎలా?

ఏసీలో గ్యాస్ ఎప్పుడూ అయిపోదు, అది లైఫ్ టైమ్ ఉంటుంది. కేవలం లీకేజీ ఉంటేనే గ్యాస్ తగ్గుతుంది. ఏసీ సరిగ్గా కూలింగ్ ఇవ్వడం లేదంటే గ్యాస్ లీక్ అయి ఉండవచ్చని గమనించాలి. గ్యాస్ నింపేటప్పుడు లీక్ ఎక్కడ ఉందో చూసి, దానిని వెల్డింగ్ చేసి, వ్యాక్యూమ్ చేసిన తర్వాతే గ్యాస్ నింపాలి. ఈ ప్రక్రియకు సుమారు 4,000 నుంచి 4,500 రూపాయల వరకు ఖర్చవుతుంది.

45
వేసవిలో ఏసీ వినియోగదారులకు సూచనలు:
Image Credit : Pixabay

వేసవిలో ఏసీ వినియోగదారులకు సూచనలు:

పవర్ ఆదా: ఏసీని ఎప్పుడూ 24 డిగ్రీల వద్ద ఉంచి వాడటం వల్ల కరెంటు బిల్లు తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది.

సీజన్ ముందే సర్వీసింగ్: ఏప్రిల్, మే నెలల వరకు ఆగకుండా, సంక్రాంతి సమయంలోనే ఏసీ సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమం.

అన్-సీజన్ లో కూడా: చలికాలంలో ఏసీ వాడకపోయినా, వారానికి ఒకసారి కనీసం 15 నిమిషాల పాటు ఆన్ చేయడం వల్ల మిషనరీ కండిషన్ లో ఉంటుంది.

ప్రొఫెషనల్ సర్వీస్: కూలింగ్ కాయిల్స్ శుభ్రం చేయడానికి బ్రష్‌లు వాడకూడదు, స్కిల్డ్ టెక్నీషియన్ చేత ప్రెషర్ క్లీనింగ్ చేయించుకోవాలి.

55
నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం
Image Credit : Pixabay

నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం

ఏసీ మన సౌకర్యం కోసమే అయినా, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. నమ్మకస్తులైన, అనుభవం ఉన్న టెక్నీషియన్ల ద్వారానే సర్వీసింగ్ చేయించుకోవడం ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Food: 1960లలో మన తాతలు ఎలాంటి ఆహారం కొనుక్కుని తినేవారో తెలుసా?
Recommended image2
ఈ గ్రామంలో ఎవరూ మరణించకూడదు, జన్మించకూడదు... దేనికైనా ముందుగా పక్కఊరు వెళ్లాల్సిందే
Recommended image3
Hamsa: హంస పాలు - నీళ్లను ఎలా వేరు చేస్తుంది? పాలను మాత్రమే తాగి నీళ్లు ఎలా వదిలేస్తుంది?
Related Stories
Recommended image1
AC Buying Tips: ఇలాంటి ఏసీ కొన్నారంటే కరెంట్ బిల్లు ఎక్కువొస్తుందన్న భయమే లేదు, బిందాస్‌గా వాడేయచ్చు
Recommended image2
Power Saving Tips: AC, కూలర్, ఫ్యాన్ ఎక్కువగా వాడినా కరెంట్ బిల్లు తగ్గాలా? ఇలా చేస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved