MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కారులో వాటర్ బాటిల్ పెట్టడం కూడా ప్రమాదమేనా..?

కారులో వాటర్ బాటిల్ పెట్టడం కూడా ప్రమాదమేనా..?

కారులో ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఉంచి... కారు కనుక ఎండలో పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది.  

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 22 2024, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సాధారణంగా మనం కారులో బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణం తర్వాత.. అందులో నుంచి బాటిల్ తీసేయడం చాలా మంది మర్చిపోతూ ఉంటారు.  కానీ.. ఇక నుంచి.. పొరపాటున కూడా కారులో నుంచి బాటిల్ తీయడం మర్చిపోకండి. ఎందుకంటే.. అది చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఎంత ప్రమాదం అంటే.. ఏకంగా... కారులో మంటలు కూడా రావచ్చు. మీకు నమ్మసక్యంగా అనిపించకపోయినా ఇది అక్షరాలా నిజం. 

24
girl drinking plastic water bottle

girl drinking plastic water bottle

నిజానికి నీరు.. మంటలను ఆర్పే గుణాన్ని కలిగి ఉంటుంది. కానీ... ఇదే నీరు కారులొ మంటలకు కారణం అవుతుందట.  నార్మల్ గా స్టీల్ బాటిల్స్ లో వాటర్ నింపుకొని ఉంచితే పర్వాలేదు. కానీ.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉపయోగించినప్పుడే ఈ ప్రమాదం జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందట. కారులో ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఉంచి... కారు కనుక ఎండలో పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. 
 

34


ఎక్కువ ఎండలో ప్లాస్టిక్ వస్తువులను ఉంచితే... అవి మెత్తగా, సన్నగా మారతాయి. ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ విషయంలోనూ అదే జరుగుతుంది.  సూర్య కిరణాలు వాటిపై పడినప్పుడు, అవి చాలా సన్నగా మారుతాయి. దీని తరువాత, ఈ కిరణాలు కారు లోపల సీట్ కవర్లు, డ్యాష్‌బోర్డ్ మొదలైన వాటితో కూడిన తోలు భాగాలలో మంటలను కలిగిస్తాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. 
 

44

మరి, ఇలా మంటలు రాకుండా ఉండాలి అంటే.. సూర్యకిరణాలు నేరుగా పడే ప్రదేశంలో ఉంచకూడదని గుర్తుంచుకోండి. కారును పార్క్ చేస్తున్నప్పుడు వాటర్ బాటిల్‌ని తీసివేయండి.  ఇక కారును ఎండలో కాకుండా.. వీలైనంత వరకు నీడ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయడం ఉత్తమం. అప్పుడు ఇలాంటి సమస్యలు రావు. ఇక... ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తో పాటు...  పెర్ఫ్యూమ్, ఆల్కహాల్, లైటర్, అగ్గిపుల్లలు మొదలైన వాటిని కారులో ఉంచకుండా ఉండటం మంచిది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Diamond Necklace: రూ.3 వేలలోపు వచ్చే అమెరికన్ డైమండ్ నెక్లెస్‌లు ఇవిగో
Recommended image2
Egg Expiry Date : ఇక కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. అసలివి ఎన్నిరోజులు నిల్వ ఉంటాయో తెలుసా?
Recommended image3
Vitamin D Deficiency: విటమిన్ డి లోపమా? మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved