MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Motivational story: ఈ నక్కలా ఆలోచిస్తే ఎంతటి కష్టం నుంచైనా తప్పించుకోవచ్చు.. చిన్న కథే కానీ ఎంతో మెసేజ్‌

Motivational story: ఈ నక్కలా ఆలోచిస్తే ఎంతటి కష్టం నుంచైనా తప్పించుకోవచ్చు.. చిన్న కథే కానీ ఎంతో మెసేజ్‌

అబద్ధం చెప్పడం తప్పు అని పెద్దలు చెబుతుంటారు. అయితే మనల్ని మనం రక్షించుకునేందుకు కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం తప్పు కాదనే సందేశాన్ని ఈ కథ చెబుతుంది. ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
| Updated : Feb 17 2025, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Fox story

Fox story

అడవికి రోజు సింహానికి ఓ రోజు ఒక అనుమానం వస్తుంది. తన నుంచి దుర్వాసన వస్తుందని సదరు సింహానికి తెగ డౌట్ కొడుతుంది. దీంతో తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని డిసైడ్‌ అవుతుంది. ఇందుకోసం అడవిలో మధ్యలోకి వెళ్లి ఎదురుగా ఎవరు వస్తున్నారని చూస్తుంది. 

ఇంతలోనే అటుగా ఓ జింక వెళ్తుంటుంది. ఆ జింకను పిలిచిన సింహం.. 'జింక జింక నా దర్గ దుర్వాసన వస్తుందా.? ' అని ప్రశ్నిస్తుంది. దీంతో భయపడ్డ జింక.. అసలే సింహం రాజు, తప్పుగా చెప్తే ఏం చేస్తుందో అని భయపడి 'అవును మహారాజా మీ నుంచి నిజంగానే దుర్వాసన వస్తోంది' అని చెబుతుంది. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన సింహం.. 'నా దగ్గరే దుర్వాసన వస్తుందని' అంటావా అంటూ జింకను చంపేస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
lion

lion

ఆ తర్వాత అక్కడే ఉన్న కోతిని పిలిచి 'నా దగ్గర దుర్వాసన వస్తుందా?' అని ప్రశ్నిస్తుంది. దీంతో కోతి సింహం మెప్పును పొందాలని ఆలోచించి 'లేదు మహారాజా అలా ఏం రావడం లేదు' అని సమాధానం ఇస్తుంది. దీంతో నాకే అబద్ధం చెప్తావా.? వాసన వస్తున్నా రావడం లేదని నన్ను మోసం చేస్తావా' అని కోతిని కూడా చంపేస్తుంది. 

అదే క్రమంలో ఓ నక్క అటుగా వెళ్తుంది. ఆ నక్కును పిలిచిన సింహం నా దగ్గర ఏదైనా వాసన వస్తుందా అని ప్రశ్నిస్తుంది. అయితే ఆ నక్క చాలా తెలివిగా ఆలోచించి.. 'మహారాజా నాకు జలుబు వల్ల సరిగ్గా వాసన తెలియడం లేదు. నేను వాసనను పసిగట్టలేకపోతున్నాను. నన్ను క్షమించండి' అంటుంది. దీంతో ఆ సింహం నక్కను వదిలిపెడుతుంది. 

నీతి: చదవడానికి చిన్న కథలాగే ఉన్నా ఇందులో ఎంతో నీతి దాగి ఉంది. సమస్య ఎదురైనప్పుడు ఇలా తెలివిగా స్పందించాలనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మనకు కూడా జీవితంలో ఇలాంటి సమస్యలే వస్తాయి. ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి కష్టాల నుంచి బయటపడాలి. మరీ ముఖ్యంగా అనవసర విషయాల్లో ఇరుక్కొని జీవితాన్ని కష్టంగా మార్చుకోకూడదు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: ట్రెండీ డిజైన్ బ్లౌజులు.. లెహంగాతో పర్ఫెక్ట్ మ్యాచ్
Recommended image2
Sleep: మీకు కూడా నిద్రలో ఛాతిపై దెయ్యం కూర్చున్నట్లు అనిపించిందా.? అస‌లు నిజం ఏంటో తెలుసా?
Recommended image3
Chain Rings: మహిళల మనసు దోచే కొత్త డిజైన్ చైన్ రింగ్స్.. చూస్తే ఫిదా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved