భారత్ లో మిని స్విట్జర్లాండ్స్.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన 9 ప్రదేశాలు
9 Mini Switzerlands of India: స్విట్జర్లాండ్ అందాలకు దీటువైనవి భారతదేశంలోనూ ఉన్నాయి. పచ్చని పచ్చికభూములు, మంచుతో కప్పబడిన శిఖరాలు, ప్రశాంత వాతావరణంతో కూడిన.. జీవితంలో ఒక్కసరైనా చూడాల్సిన 9 అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్విట్జర్లాండ్ అంటే మంచుతో కప్పబడిన పర్వతాలు గుర్తొస్తాయి. భారతదేశంలో కూడా 'మిని స్విట్జర్లాండ్' అని పిలువబడే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అల్పైన్ భూభాగం, పచ్చని పచ్చికభూములు, సుందర ప్రకృతి దృశ్యాలకు ఈ ప్రదేశాలు ప్రసిద్ధి చెందాయి. స్విస్ అనుభూతి కోరుకునేవారికి ఈ ప్రదేశాలు అనువైనవి. భారతదేశంలోని 'మిని స్విట్జర్లాండ్' అని పిలువబడే.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన 9 అద్భుతమైన ప్రదేశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖజ్జియార్, హిమాచల్ ప్రదేశ్: ఖజ్జియార్ పఠాన్‌కోట్ రైల్వే స్టేషన్ నుండి 95 కిలోమీటర్లు, కంగ్రా జిల్లాలోని గగ్గల్ విమానాశ్రయం నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖజ్జియార్ సర్ప దేవుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ ఖజ్జీ నాగ మందిరానికి ప్రసిద్ధి. ఇది ఒక హిల్ స్టేషన్ ప్రాంతం. పచ్చని పచ్చికభూములు, దట్టమైన అడవులు, 'భారతదేశంలోని మిని స్విట్జర్లాండ్'గా గుర్తింపు పొందింది. గుర్రపు స్వారీ, హైకింగ్, పిక్నిక్‌లకు ఇది అనువైన ప్రదేశం.
ఔలి, ఉత్తరాఖండ్: ఔలి, ఔలీ బుగ్యాల్ అని కూడా పిలిచే ఈ ప్రాంతం భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాలలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. చమోలి జిల్లాలో సముద్ర మట్టానికి 2,500–3,050 మీటర్ల ఎత్తులో ఉంది. గర్వాల్ హిమాలయాల్లో ఉంది. స్కీయింగ్ కి స్వర్గధామం. అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన శీతాకాల క్రీడలకు ప్రసిద్ధి.
యుమ్‌థాంగ్ లోయ, సిక్కిం: స్విట్జర్లాండ్ పుష్పాలను పోలిన అల్పైన్ పుష్పాలకు ప్రసిద్ధి. ఇక్కడి అద్భుతమైన మంచు శిఖరాలు, వేడి నీటి బుగ్గలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
కౌసాని-ఉత్తరాఖండ్ : నందాదేవి, ఇతర హిమాలయ శిఖరాలను చూడటానికి కౌసాని తప్పనిసరి. అద్భుతమైన పర్వత నేపథ్యం మిమ్మల్ని స్విట్జర్లాండ్‌కు తీసుకెళ్తుంది. ఉత్తరాఖండ్ లోని కౌసనిని సెప్టెంబర్ నుండి మే వరకు సందర్శించడానికి అనువైన సమయం. మార్చి నుండి మే వరకు వేసవి నెలలు ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతతో ఉంటాయి.కౌసనిలో అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు మంచు కురుస్తుంది.
పరోట్ లోయ, హిమాచల్ ప్రదేశ్: స్విస్ లాంటి ప్రకృతి దృశ్యాలు, పచ్చని పర్వతాలు, ఎత్తైన పైన్ చెట్లు. ఫిషింగ్, సాహస క్రీడలకు ఇది ప్రసిద్ది చెందింది.
చోప్తా, ఉత్తరాఖండ్: 'మిని స్విట్జర్లాండ్' అని పిలుస్తారు. పచ్చని పచ్చికభూములు, మంచు శిఖరాలతో కూడిన అద్భుతమైన ప్రదేశం.
కాశ్మీర్: భూతల స్వర్గంగా గుర్తింపు పొందిన కాశ్మీర్ అందాల గురించి ఎంత చెప్పిన తక్కువే. దాల్ సరస్సు, లోయలు, మంచు శిఖరాలతో స్విట్జర్లాండ్‌కు దీటుగా ఉంటుంది. మంచుతో కప్పబడిన అందమైన పర్వతాలు, పచ్చని లోయలు, సహజ సరస్సుల దృశ్యాలు చూడటానికి మాటల్లో చెప్పలేని అనుభూతిని పంచుతాయి. జమ్మూ కాశ్మీర్‌లో టెర్రస్ లాన్‌లు, క్యాస్కేడింగ్ ఫౌంటైన్‌లు, అరుదైన పూలతో కూడిన పూలచెట్లతో కూడిన లెక్కలేనన్ని తోటలు మీకు కనుల విందు చేస్తాయి.
మున్సియారి, ఉత్తరాఖండ్: పంచాచులి శిఖరాలు, హిమానీనదాల అద్భుతమైన దృశ్యాలు. ప్రకృతి ప్రేమికులకు, ట్రెక్కర్లకు అనువైన ప్రదేశం.
కూర్గ్: ఆహ్లాదకరమైన వాతావరణం, మరపురాని అనుభవాలు. స్విట్జర్లాండ్ లాంటి ఆకర్షణ. సుగంధ ద్రవ్యాలు, ఏలకులు, కాఫీ, మిరియాలు, తేనె, చందనం వాసనలు. కూర్గ్ దాని పచ్చని ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన జలపాతాలు, సుగంధ కాఫీ తోటలు, అక్కడి గొప్ప సాంస్కృతిక వారసత్వంతో ప్రసిద్ధి చెందింది . అక్టోబర్ నుండి మార్చి వరకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి అందాలు మీకు సరికొత్త అనుభూతిని పంచుతాయి.