శృంగారాన్ని ఆపేస్తే ఏమవుతుందో తెలుసా?
శృంగారం ప్రతీ మనిషికి కనీసావసరం. భాగస్వాముల మధ్య సెక్స్ రోజూ జరుగుతుందా, వారానికొకసారా? అనేదాన్ని బట్టి వారి వైవాహిక జీవితం ఎంత సంతృప్తిగా గడుస్తుందో చెప్పొచ్చు. అలా కాకుండా శృంగారాన్ని మీ జీవితాలనుంచి దూరం చేస్తే ఏం జరుగుతుంది. అంటే.. ఈ ఏడు విషయాలు తెలుసుకోవాలంటున్నారు.
ఆందోళన
ఒత్తిడి ఎక్కువగా ఉండే వారికి శృంగారం మంచి మెడిసిన్ గా సూచిస్తుంటారు. కారణం ఒత్తిడిని విడుదల చేసే హార్మోన్లను తగ్గించడంలో సెక్స్ సహాయపడుతుంది. అందుకే అకస్మాత్తుగా శృంగారం చేయడం మానేస్తే.. మరింత ఒత్తిడికి లోనవుతారు. చురుకైన లైంగిక జీవితాల వల్ల సంతోషంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.
తక్కువ కేలరీలను బర్న్ చేస్తారు
సెక్స్ అనేది ఆరోగ్యకరమైన మంచి వ్యాయామం, చాలా మంది సెక్స్ సమయంలో నిమిషానికి 5 కేలరీలు కోల్పోతారు. ఇది చురుకైన నడకతో సమానమని చెప్తారు. మీరు సెక్స్ చేయడం మానేసిన తర్వాత, మీ శరీరం మందగిస్తుంది. మీరు కేలరీలు బర్న్ చేయడానికి మరొక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది.
మతిమరుపు ఎక్కువవుతుంది
కొన్ని అధ్యయనాలు, సిద్ధాంతాల ప్రకారం రెగ్యులర్ సెక్స్ మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు సెక్స్ చేయడం మానేసిన తర్వాత మీరు మరింత మరచిపోయే అవకాశం ఉంది.
సంబంధంలో మార్పులు
కనీసం వారానికి ఒకసారి సెక్స్ చేసినప్పుడు, జంటగా మీరు సంతోషంగా ఉంటారు. ఇది మీ బంధాన్ని, నమ్మకాన్ని పెంపొందించడానికి సాయపడుతుంది. మీ ఇద్దరినీ మరింత అవగాహన చేసుకునేలా చేయడంలో సహాయపడుతుంది. సెక్స్ లేకపోవడం వల్ల బందాలు విచ్చిన్నమవుతాయి. నిరాశ పెరుగుతుంది.
నిద్ర లేమి
మీరు సెక్స్ చేయడం మానేస్తే, ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్లను కోల్పోతారు, ఇది మీకు అవసరమైన ప్రశాంతమైన నిద్రలో సహాయపడుతుంది.
నొప్పులు
అకస్మాత్తుగా సెక్స్‌పై స్టాపర్ పెట్టడం వల్ల మీకు తీవ్రమైన నొప్పులు వస్తుంటాయి. ఎందుకు సడెన్ గా ఇలా నొప్పులు వస్తున్నాయో తెలియక తికమకపడతారు. సెక్స్ సమయంలో ఉద్వేగం వల్ల ఎండార్ఫిన్లను విడుదలవుతాయి. ఇవి కాలు, తల, వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
సెక్స్ డ్రైవ్ తగ్గిస్తుంది
రెగ్యులర్ సెక్స్ లేకపోవడం వల్ల యోని పనివిధానంలో కూడా మార్పులు వస్తాయి. పురుషుల్లో ఇది అంగస్తంభన లోపం కూడా కలిగిస్తుంది.