Beauty Tips: మీ మేకప్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మేకప్ కిట్ మార్చాల్సిందే!
Beauty Tips: మీరు మీ మేకప్ కిట్ నీ ఎక్కువ కాలం నుంచి వాడుతున్నారా అయితే మీ చర్మానికి సమస్యలు మొదలైనట్టే. మీ మేకప్ కిట్ ని మార్చవలసిన సమయం వచ్చిందని మీకు అర్థమయ్యే కొన్ని సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక మేకప్ కిట్ ని మనం ఓపెన్ చేసిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే వాడాలి. వాటికి లైఫ్ ఫ్యాన్ చాలా తక్కువగా ఉంటుంది. మస్కారా లాంటి వాటికి లైఫ్ ఇంకా తక్కువగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా చూసి టైం అయిపోయిన తర్వాత పారేసి కొత్తది కొనుక్కోవడం మంచిది.
లేకపోతే లేనిపోని సమస్యలన్నీ మన చర్మానికి వచ్చి చుట్టుకుంటాయి. మనం మేకప్ వేస్తున్నప్పుడు దాని వాసనని తరచుగా చూస్తూ ఉండాలి. దాని వాసన ఏమైనా మారుతుంది అని తెలుస్తున్నప్పుడు దాన్ని లైఫ్ స్పాన్ అయిపోయిఅది పాడైపోతుందని అర్థం.
అలాంటి సమయంలో దానిని మార్చేయడం మంచిది. మనం ఒక మేకప్ ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ తెలియకపోతే కొన్ని నెలలు వాడిన తర్వాత దాన్ని మార్చేయడం మంచిది. ఎందుకంటే ఒక మేకప్ కిట్ ని సంవత్సరం కన్నా ఎక్కువ వాడిన తర్వాత అది ఎక్స్పైర్ అయిందో..
లేదో మనకి తెలియకపోతే వాడడం డేంజర్ దానికన్నా మార్చేయడం బెటర్. మనం మేకప్ కిట్ వాడుతున్నప్పుడు అది రోజురోజుకీ ఒరిజినల్ షేప్, కలర్ తగ్గుతూ వస్తుంది. కొన్ని రోజులకి అది ఎప్పుడైతే దాని సొంత రంగు రూపులని విడుస్తుందో..
అప్పుడు అది హార్మ్ ఫుల్ గా మారుతున్నట్టు అర్థం చేసుకొని దాన్ని మార్చుకోవడం మంచిది. పైన ఉన్న ఈ సూచనల ప్రకారం మీ దగ్గర ఉన్న మేకప్ కిట్ మంచిదో లేకపోతే హానికరమైనదో చూసి ఒకవేళ పైనున్న లక్షణాలు ఏవి ఉన్నా సరే వెంటనే దాన్ని మార్పించుకోవడం మంచిది.
లేకపోతే అది స్కిన్ కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మేకప్ కిట్ కొనేటప్పుడే జాగ్రత్త పడాలి . లేకుంటే మనం ఇంటికి తెచ్చుకున్న కొద్దిరోజులకే మేకప్ కిట్ ఎక్స్పైరీ అయిపోతుంది. ఆ మేకప్ కిట్ తో మేకప్ వేసుకోవడం వలన లేనిపోని చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని మేకప్ ప్రోడక్ట్ లు తీసుకోవడం ఎంతో అవసరం.