MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Honeymoon : కొత్తగా పెళ్లయిందా? అయితే గోవా వెళ్లాల్సిందే.. అక్కడ ఆ మజానే వేరు!

Honeymoon : కొత్తగా పెళ్లయిందా? అయితే గోవా వెళ్లాల్సిందే.. అక్కడ ఆ మజానే వేరు!

Honeymoon : భారతదేశంలో బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్ లలో గోవా ఒకటి. ఇది రొమాన్స్, అడ్వెంచర్, లగ్జరీ లైఫ్ కు పెట్టింది పేరు. ప్రశాంతమైన బీచ్‌ల నుండి వైబ్రంట్ నైట్‌లైఫ్ వరకు, కలర్ ఫుల్ కల్చర్ నుండి రుచికరమైన భోజనం వరకు.. మీకు కొత్త అనుభూతిని పంచుతుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 06 2026, 11:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
హనీమూన్‌కు గోవానే బెస్ట్.. రొమాంటిక్ ట్రిప్ కోసం ఈ 7 కారణాలు చాలు !
Image Credit : Getty

హనీమూన్‌కు గోవానే బెస్ట్.. రొమాంటిక్ ట్రిప్ కోసం ఈ 7 కారణాలు చాలు !

భారతదేశంలో పెళ్లి తర్వాత కొత్త జంటలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే ప్లేస్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా గోవానే. రొమాన్స్, అడ్వెంచర్, లగ్జరీ.. ఇలా అన్నీ ఒకే చోట దొరికే ఏకైక డెస్టినేషన్ ఇది. మీరు మీ పార్ట్‌నర్‌తో కలిసి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలను మూటగట్టుకోవాలనుకుంటే గోవాకు మించిన ఆప్షన్ మరొకటి లేదు. గోవా ఎందుకు అంత స్పెషల్? హనీమూన్ కపుల్స్ అక్కడికే ఎందుకు క్యూ కడుతున్నారు? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

27
రొమాంటిక్ ఎస్కేప్స్ కోసం అద్భుతమైన బీచ్‌లు
Image Credit : Getty

రొమాంటిక్ ఎస్కేప్స్ కోసం అద్భుతమైన బీచ్‌లు

గోవా అనగానే ముందుగా గుర్తొచ్చేవి అందమైన బీచ్‌లు. ఇక్కడి గోల్డెన్ ఇసుక తిన్నెలు, నీలి రంగు సముద్రం హనీమూన్ కపుల్స్‌కు ఒక డ్రీమ్ లొకేషన్‌లా ఉంటాయి. మీకు సందడి ఇష్టమైతే బాగా బీచ్ బెస్ట్. అక్కడ మ్యూజిక్, కెఫేలతో లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు మాకు ఏకాంతం కావాలి అనుకుంటే పాలోలెం వంటి ప్రశాంతమైన బీచ్‌లకు వెళ్లొచ్చు. సాయంత్రం వేళ సూర్యాస్తమయాన్ని చూస్తూ సముద్రం ఒడ్డున మీ పార్ట్‌నర్‌తో కలిసి నడవడం ఒక మధురమైన అనుభూతినిస్తుంది. చాలా బీచ్‌లలో క్యాండిల్ లైట్ డిన్నర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Related Articles

Related image1
Goa Trip: బాలీవుడ్ సినిమాల్లో చూసే ఆ అందమైన లొకేషన్లు గోవాలో ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Related image2
Celebrity Restaurants : గోవా వెళ్తున్నారా? విరాట్ కోహ్లీ నుంచి శిల్పా శెట్టి వరకు.. సెలబ్రిటీల టాప్ 6 రెస్టారెంట్లు ఇవే!
37
ఎనర్జిటిక్ నైట్ లైఫ్.. బీచ్ పార్టీలు
Image Credit : Getty

ఎనర్జిటిక్ నైట్ లైఫ్.. బీచ్ పార్టీలు

కొత్త జంటలకు కేవలం ప్రశాంతతే కాదు, కొంచెం జోష్ కూడా కావాలి. గోవా నైట్ లైఫ్ దానికి పర్ఫెక్ట్. ముఖ్యంగా టిటోస్ లేన్ లో ఉండే క్లబ్బులు, బార్లలో లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. నియాన్ లైట్ల వెలుగులో, బీచ్ పార్టీలలో మీ పార్ట్‌నర్‌తో కలిసి డ్యాన్స్ చేయడం మీ ట్రిప్‌కు ఒక క్రేజీ వైబ్‌ను ఇస్తుంది. ప్రతి రోజూ ఏదో ఒక థీమ్ పార్టీ జరుగుతూనే ఉంటుంది, కాబట్టి ఇక్కడ బోర్ కొట్టే ప్రసక్తే ఉండదు.

47
లగ్జరీ రిసార్ట్స్.. ప్రైవేట్ విల్లాలు
Image Credit : Getty

లగ్జరీ రిసార్ట్స్.. ప్రైవేట్ విల్లాలు

హనీమూన్ అంటే కొంచెం లగ్జరీగా ఉండాలి కదా! గోవాలో తాజ్ ఎగ్జోటికా, ద లీలా గోవా వంటి వరల్డ్ క్లాస్ రిసార్టులు ఉన్నాయి. ప్రైవేట్ పూల్స్, కపుల్ స్పా థెరపీలు, సముద్రం కనిపిస్తూ ఉండే రూమ్స్ మీ మూడ్‌ని మార్చేస్తాయి. ప్రైవేట్ విల్లాల్లో ఉంటే ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఉదయాన్నే అలల శబ్దంతో నిద్రలేవడం, బెడ్ పైనే బ్రేక్ ఫాస్ట్.. ఈ రేంజ్ లగ్జరీ గోవాలో మాత్రమే సాధ్యం.

57
పోర్చుగీస్ సంస్కృతి..
Image Credit : Gemini

పోర్చుగీస్ సంస్కృతి..

గోవాలో కేవలం బీచ్‌లే కాదు, మంచి కల్చర్ కూడా ఉంది. ఇక్కడ పోర్చుగీస్ పాలన తాలూకు గుర్తులు ప్రతి చోటా కనిపిస్తాయి. బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ వంటి చారిత్రక కట్టడాలు, కలర్‌ఫుల్ వీధులు మిమ్మల్ని యూరప్‌లో ఉన్నామా? అన్న ఫీలింగ్‌ను కలిగిస్తాయి. పాత కాలపు విల్లాలు, అందమైన చర్చిలు తిరుగుతూ ఫోటోలు దిగడం ఒక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్.

67
అదిరిపోయే సీఫుడ్.. రొమాంటిక్ డిన్నర్లు
Image Credit : Getty

అదిరిపోయే సీఫుడ్.. రొమాంటిక్ డిన్నర్లు

భోజన ప్రియులకు గోవా ఒక ప్యారడైజ్. ఇక్కడి స్పైసీ గోవన్ కర్రీలు, ఫ్రెష్ సీఫుడ్ అస్సలు మిస్ కావద్దు. సముద్రపు అలల శబ్దం వింటూ, నక్షత్రాల వెలుగులో బీచ్ ఒడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం ప్రతి జంట కల. చాలా రెస్టారెంట్లు కపుల్స్ కోసం ప్రైవేట్ డైనింగ్ ఏర్పాట్లు కూడా చేస్తాయి. ఇక్కడి లోకల్ ఫుడ్ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.

77
థ్రిల్ కోరుకునే జంటల కోసం అడ్వెంచర్ గేమ్స్
Image Credit : Getty

థ్రిల్ కోరుకునే జంటల కోసం అడ్వెంచర్ గేమ్స్

మీరు అడ్వెంచర్ ఇష్టపడే జంట అయితే గోవా మిమ్మల్ని నిరాశపరచదు. కలంగుట్ వంటి బీచ్‌లలో పారాసెయిలింగ్, జెట్ స్కీయింగ్, బనానా బోట్ రైడ్స్ వంటివి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకాస్త థ్రిల్ కావాలంటే స్కూబా డైవింగ్ కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటి అడ్వెంచర్స్ చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఇంకా పెరుగుతుంది. కలిసి కొత్త పనులు చేయడం వల్ల కలిగే ఆ కిక్కే వేరు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fertility Crisis: ప్రమాదంలో మానవ జాతి? భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కష్టమే.. ఏం జరుగుతోంది?
Recommended image2
Beetroot : పచ్చిగానా? ఉడికించా? రోజూ బీట్‌రూట్ తింటే బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే !
Recommended image3
Isha Ambani: 400 ఏళ్లనాటి నిజాం నగలతో ఈషా అంబానీ బ్లవుజు తయారీ, వాటి ధర తెలిస్తే అవాక్కవుతారు
Related Stories
Recommended image1
Goa Trip: బాలీవుడ్ సినిమాల్లో చూసే ఆ అందమైన లొకేషన్లు గోవాలో ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Recommended image2
Celebrity Restaurants : గోవా వెళ్తున్నారా? విరాట్ కోహ్లీ నుంచి శిల్పా శెట్టి వరకు.. సెలబ్రిటీల టాప్ 6 రెస్టారెంట్లు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved