MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • life lessons మీ జీవితం మారిపోవాలా? అయితే మీరూ ఇలా మారాల్సిందే!

life lessons మీ జీవితం మారిపోవాలా? అయితే మీరూ ఇలా మారాల్సిందే!

అంతా మన చేతుల్లోనే: కొందరు లైఫ్ ఎంజాయ్ చేయడానికే పుట్టినట్టు కొందరు ఎప్పుడూ జాలీగా ఉంటారు. ఇంకొందరు భూమి భారం మొత్తం తామే మోస్తున్నట్టు బాధగా కనిపిస్తుంటారు. సంతోషంగా ఉండేవారికి అసలు బాధలేం లేవంటారా? బాధపడే వ్యక్తుల జీవితంలో సంతోషించే సందర్భాలే ఉండవంటారా? రెండూ ఉంటాయి. కానీ పరిస్థితులకు స్పందించే తత్వం, సందర్భాలను తమకు అనుకూలంగా మలచుకునే విధానానికి అనుగుణంగానే మనకు కష్టాలు, సుఖాలను ఫీల్ అవుతుంటాం. కొన్ని సింపుల్ మార్పుల ద్వారా అనవసర కష్టాల నుంచి తేలికగా బయట పడవచ్చు. కొన్ని చెడు అలవాట్లను వదులుకోవడం ద్వారా జీవితం సంతోషమయం చేసుకోవచ్చు.   

1 Min read
Author : Anuradha B
Published : Apr 21 2025, 08:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జీవితాన్ని క్లిష్టతరం చేసుకునే మార్గాలు

జీవితాన్ని క్లిష్టతరం చేసుకునే మార్గాలు

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. జీవితంలో అన్నీ కష్టాలే ఉండవు. అతిగా ఆలోచించడం, అనవసరమైన చింతలు,  కొన్ని అలవాట్లు జీవితాన్ని క్లిష్టతరం చేస్తాయి. ఈ ఆలోచన ధోరణిని గుర్తించి, మార్చుకోవడం ద్వారా సంతృప్తికరమైన, సమతుల్య జీవితాన్ని గడపడంపై దృష్టి పెట్టవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1. అతిగా ఆలోచించడం

1. అతిగా ఆలోచించడం

మనం జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. కొన్ని విషయాల్లో నిర్ణయం వెంటనే జరగాలి. అదేపనిగా నాన్చడం, సందేహించడం.. చేస్తూ ఉంటే మానసిక అలసట ఎక్కువ అవుతుంది. చర్య తీసుకోవడంలో జాప్యం ఏర్పడి ఫలితాలు అందకుండా పోతాయి మానసిక ఒత్తిడి కలుగుతుంది.  ఆ అలవాటు అలాగే కొనసాగితే ఏ నిర్ణయమూ తీసుకోలేని అసమర్థుడిగా మిగిలిపోతాం.

35
2. ఇతరుల ఆమోదం కోరడం

2. ఇతరుల ఆమోదం కోరడం

ఒక పని చేసే ముందు నలుగురి అభిప్రాయం కోరడం తప్పేం కాదు. కానీ ప్రతి చిన్న విషయానికి వాళ్ల సలహా తీసుకోవడం, అందరికీ నచ్చాలనుకోవడం అవివేకం.  చేసే ప్రతి పనిలో ఇలా చేస్తే ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించడం.. వ్యక్తిగత ఆనందాన్ని హరించివేస్తుంది. ఇతరుల గురించి ఆలోచించడం మానేసి, సొంత ఆనందాలను వెతుక్కుంటూ ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

45
3. పదేపదే గతం తలచుకోవడం

3. పదేపదే గతం తలచుకోవడం

జరిగిగిపోయింది తిరిగి రాదు. జరిగినదానిని ఎవరూ తిరిగి మార్చలేరు. వైఫల్యాలను పదేపదే తలచుకోవడం, చెడు జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం.. వర్తమానాన్ని నరకం చేస్తుంది.  దైనందిన జీవితంలో అనవసరమైన భారం పెరుగుతుంది. ఇది అవకాశాలకు ఆటంకంగా నిలుస్తుంది. అనుభవాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకోకుండా నిరోధిస్తుంది. గతాన్ని వదులుకొని, మనల్ని మనం క్షమించుకోవడం ద్వారానే అభివృద్ధి పథంలో ముందుకు సాగగలుగుతాం.

55
4. మార్పును నిరోధించడం

4. మార్పును నిరోధించడం

కొందరు మార్పును ఇష్టపడరు. కంఫర్ట్ జోన్ దాటి బయటికి రారు. కానీ జీవితంలో మార్పులకు సిద్ధపడకపోతే ముందుకు వెళ్లలేం. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే తన కంఫర్ట్ జోన్ ని బద్దలు కొట్టుకొని బయటకి రావాల్సిందే. భయపడి కొత్త నిర్ణయాలు తీసుకోకపోతే, సౌకర్యాలు వదిలి బయటికి రాకపోతే ఎన్నో అవకాశాలు కోల్పోతాం.  మార్పును ఓపెన్ మైండ్‌తో స్వాగతించడం వలన జీవితం సులభతరం అవుతుంది. వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమవుతుంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
బంధుత్వం
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Whisky: ఇండియన్స్ విస్కీనే ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు? కారణం ఏంటో తెలుసా?
Recommended image2
మీ ఇంటి కరెంట్ బిల్లు తగ్గాలంటే.. సాధారణ బల్బ్ బెటరా లేక ఎల్ఈడీ బల్బా?
Recommended image3
Blouse designs: చీరకు హుందాతనం తెచ్చే ఫుల్ స్లీవ్స్ బ్లౌజు డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved