మందార ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించాలి. ఇది చుండ్రుతో పాటు పేల సమస్యను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: pinterest
Telugu
తులసి ఆకులు
పేల నివారణకు తులసి అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని తులసి ఆకులను పేస్ట్ చేసి, తలకు పట్టించాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే పేలు తొలగిపోతాయి.
Image credits: instagram
Telugu
బేబీ ఆయిల్
పేల సమస్యకు బేబీ ఆయిల్ ఒక మంచి మార్గం. రాత్రి పడుకునే ముందు బేబీ ఆయిల్‌ను తలకు బాగా పట్టించి, రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే దువ్వెనతో దువ్వి, ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
Image credits: Getty
Telugu
ఆలివ్ ఆయిల్
తలలో పేలను వదిలించుకోవడానికి ఆలివ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు తలకు ఆలివ్ ఆయిల్ పట్టించాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి.
Image credits: Getty
Telugu
వేపాకు
వేపాకులను మెత్తగా నూరి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను వారానికి ఒకసారి తలకు పట్టించి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రంగా కడగాలి. ఇది పేలను సులభంగా తొలగిస్తుంది.
Image credits: Instagram
Telugu
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ పేలకు వ్యతిరేకంగా చక్కగా పనిచేస్తుంది. కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని, మాడుకు పట్టించడం వల్ల పేలను సులభంగా వదిలించుకోవచ్చు.