- Home
- Life
- India Switzerland: విదేశాలకు అక్కర్లేదు, మన దగ్గరే స్విట్జర్లాండ్... వెళ్లడానికి ఇదే బెస్ట్ టైమ్..!
India Switzerland: విదేశాలకు అక్కర్లేదు, మన దగ్గరే స్విట్జర్లాండ్... వెళ్లడానికి ఇదే బెస్ట్ టైమ్..!
India Switzerland: జీవితంలో ఒక్కసారి అయినా స్విట్జర్లాండ్ వెళ్లాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే, విదేశాలకు వెళ్లకుండా స్విట్జర్లాండ్ అనుభూతిపొందచ్చు.

మన దేశంలో స్విట్జర్లాండ్ ఎక్కడ ఉంది?
స్విట్జర్లాండ్ ని చూడాలని కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ, అక్కడిదాకా వెళ్లాలి అంటే... లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ, అంత ఖర్చు లేకుండా, మన దగ్గరలోనే స్విట్జర్లాండ్ ఫీల్ ఇచ్చే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. పూర్తిగా మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన అడవులు, పచ్చటి లోయలతో, అద్దంలాంటి సరస్సులతో అచ్చం స్విట్జర్లాండ్ ను తలపించే మన దేశంలో ఉన్నాయి. ఆ ప్రదేశాలు ఏంటి? ఎక్కడ ఉన్నాయి?
1.మినీ స్విట్జర్లాండ్...
హిమాచల్ ప్రదేశ్ లోని ఈ సుందరమైన ప్రదేశాన్ని అధికారికంగా ‘ ఇండియాస్ మినీ స్విట్జర్లాండ్’ అని పిలుస్తారు. దట్టమైన దేవదారు అడవుల మధ్యలో విస్తరించి ఉంటుంది. అందమైన పచ్చిక బయళ్లు, వాటి మధ్యలో ఉండే స్వచ్ఛమైన చిన్న సరస్సు కూడా ఉంటుంది. అందుకే, చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
2.గుల్మార్గ్...
మన దేశంలో మంచు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది జమ్మూ కాశ్మీర్. ఈ కాశ్మీర్ లో ని ప్రత్యేక ప్రదేశం గుల్మార్గ్. ఈ ప్రదేశం కూడా చూడటానికి స్విట్జర్లాండ్ లా ఉంటుంది. ఇక్కడ ప్రదేశం మొత్తం మంచుతో కప్పబడి పర్వతాలు కనిపిస్తాయి. ఆ కొండల మధ్య ఉన్న గుల్మార్గ్ అచ్చం స్విట్జర్లాండ్ తలపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో.. మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ రైడ్స్‌లో ఒకటైన 'గండోలా' రైడ్ ద్వారా మంచు కొండల మధ్య ప్రయాణించడం జీవితంలో మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది.
3.ఆలీ..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆలీ అనే ప్రదేశం కూడా చూడటానికి స్విట్జర్లాండ్ లా ఉంటుంది. మంచుతో గడ్డకట్టిన కొండచరియలు, ఎత్తైన పచ్చటి గడ్డి మైదానాలు ఉండటంతో... ఈ ఆలీ అనే ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. మన దేశంలో 'స్కీయింగ్' (Skiing) క్రీడలకు ఆలీ అత్యంత ప్రసిద్ధి చెందిన కేంద్రం. ఏడాది పొడవునా నందాదేవి పర్వత శ్రేణుల అద్భుతమైన హిమాలయ దృశ్యాలను చూస్తూ స్విట్జర్లాండ్ స్కీ రిసార్ట్‌లలో ఉన్న అనుభూతిని పొందవచ్చు.
4. మున్సియారి, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని కుమావూన్ ప్రాంతంలో హిమాలయాల ఒడిలో ఒదిగి ఉన్న మున్సియారి ప్రకృతి ప్రియులకు ఒక నిజమైన స్వర్గధామం. ఇక్కడి నుంచి అత్యంత స్పష్టంగా కనిపించే 'పంచచూలి' పర్వత శిఖరాల అద్భుత దృశ్యాలు ఎవరికైనా కనులవిందు చేస్తాయి. ఇక్కడికి వెళితే.. అక్కడి ప్రదేశాలు చూస్తే... స్విట్జర్లాండ్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది..













