పరీక్ష లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ... నెలకు రూ.80,000 జీతం...!!
నెలకు 70, 80 వేల రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత కలిగినవారు వెంటనే అప్లై చేయండి... రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాన్ని పొందండి.
Jobs
ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం... అది కూడా ఎలాంటి రాతపరీక్ష లేకుండానే పొందే అవకాశం. ఈ అద్భుత అవకాశాన్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ కల్పిస్తోంది. ఈ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీచేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
Jobs
ఆయిల్ ఇండియా కంపనీ భారీ జీతభత్యాలతో ఇంజనీర్స్ నియామక ప్రక్రియ చేపట్టింది. పోస్టులు చాలా తక్కువే అయినా... ఎలాంటి రాతపరీక్ష లేకపోవడంతో అర్హత కలిగిన ప్రతిఒక్కరు ఈ జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. కేవలం ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిస్తే ఈ ఉద్యోగం మీ సొంతం అవుతుంది.
Jobs
ఇలా ఆయిల్ ఇండియా కంపనీలో మొత్తం 7 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో కెమిస్ట్ 2, డ్రిల్లింగ్ ఇంజనీర్ 2, సివిల్ ఇంజనీర్ 1, జియాలజిస్ట్ 2 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోస కంపనీ అధికారికి వెబ్ సైట్ www.oil-india.com పరిశీలించండి.
Jobs
విద్యార్హతలు-వయో పరిమితి :
కెమిస్ట్ :
ఈ ఉద్యోగానికి ఏదయినా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి కెమిస్ట్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు అర్హులు. లేదంటే కెమికల్, పెట్రోలియం,మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి వుండాలి. రెండేళ్ల అనుభవం వుండాలి.
పైన పేర్కొన్న విద్యార్హతలు కలిగి 24-50 ఏళ్లలోపువారు ఈ జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికయితే నెలకు రూ.70 వేల జీతం పొందవచ్చు.
Jobs
డ్రిల్లింగ్ ఇంజనీర్ :
పెట్రోలియంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా నాలుగేళ్ల మెకానికల్ ఇంజనీరింగ్ చేసి వుండాలి. అలాగే మూడేళ్లు పాటు గ్యాస్ ఇండస్ట్రీ లేదా ఆయిల్ కంపనీలో ఉద్యోగానుభవం వున్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
20-40 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారికి నెలకు రూ.80,000 సాలరీ వస్తుంది.
Jobs
జియాలజిస్ట్ :
జియాలజీలో పిజి చేయడంతో పాటు రెండేళ్లపాటు గుర్తింపు పొందిన సంస్థలో అప్లైడ్ జియాలజీ చేసివుండాలి. అలాగే మూడేళ్ల అనుభవం వుండాలి. ఈ అర్హతలు కలిగి 24-40 ఏళ్లలోపు వయసుండాలి. ఈ ఉద్యోగం పొందినవారికి ప్రతినెలా రూ.80 వేల జీతం వస్తుంది.
Jobs
సివిల్ ఇంజనీర్ :
గుర్తింపు పొందిన సంస్థలో నాలుగేళ్ల సివిల్ ఇంజనీరింగ్ కోర్సు చేసివుండాలి. మూడేళ్ళ అనుభవం వుండాలి. 24-40 ఏళ్లలోపు వయసుండాలి. ఈ పోస్ట్ కు ఎంపికైనవారికి నెలకు రూ.70 వేల సాలరీ అందుతుంది.
Jobs
ఇంటర్వ్యూ :
పైన పేర్కొన్న అర్హతలు కలిగినవారు ఈ నెల అంటే ఆగస్ట్ 16, 2024 న ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి వుంటుంది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో గల మహానది బేసిన్ ప్రాజెక్ట్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, IDCO టవర్స్ మూడో అంతస్తులో ఈ ఇంటర్వ్యూ వుంటుంది. విద్యార్హతలతో పాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న పత్రాలతో (ఒరిజినల్స్) ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ వుంటుంది.