రూ.1,20,000 సాలరీతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ... వెంటనే అప్లై చేసుకొండి
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, జీతం, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.

పవర్ గ్రిడ్ ఉద్యోగాలు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అరుదైన అవకాశం!
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు 1543 ఖాళీలను భర్తీ చేస్తోంది. నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000 వరకు జీతంతో కూడిన ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఖాళీలు, పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ప్రకారం వివిధ విభాగాల్లో 1543 ఖాళీలు ఉన్నాయి. ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 532, ఫీల్డ్ ఇంజనీర్ (సివిల్) - 198, ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్) - 535, ఫీల్డ్ సూపర్‌వైజర్ (సివిల్) - 193, ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) - 85 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్, డిప్లొమా చేసినవారికి మంచి అవకాశం.
విద్యార్హతలు, జీతం
ఫీల్డ్ ఇంజనీర్ పోస్టుకు B.E., B.Tech, B.Sc (Engg.) (ఎలక్ట్రికల్/సివిల్) 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. జీతం నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000 వరకు ఉంటుంది.
ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుకు సంబంధిత 3 సంవత్సరాల డిప్లొమాలో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. జీతం నెలకు రూ.23,000 నుండి రూ.1,05,000 వరకు ఉంటుంది.
ఈ ఉద్యోగాతలకు వయస్సు 18 నుండి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు వర్తించే వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం
దరఖాస్తు ఫీజు పోస్టును బట్టి ఉంటుంది. ఫీల్డ్ ఇంజనీర్ పోస్టుకు రూ.400, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుకు రూ.300 ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD, ఎక్స్-సర్వీస్‌మెన్ కు ఫీజు లేదు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 17, 2025. అర్హులైన అభ్యర్థులు www.powergrid.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.