Jobs : తెలుగోళ్లకు బంపరాఫర్ ... రూ.1,40,000 సాలరీతో ఈ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు
ఆంధ్ర ప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Government Jobs : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేసేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు... ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలచేశారు. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ (APMSRB) ద్వారా రాష్ట్ర హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 185 (30 స్పెషలిస్ట్ డాక్టర్లు, 155 మెడికల్ ఆఫీసర్) పోస్టులను భర్తీచేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమయ్యింది... కాబట్టి అన్ని అర్హతలుండి వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకుముందు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి.
పోస్టులు, ఖాళీల వివరాలు
1. జనరల్ ఫిజిషియన్ (టెలి మెడిసిన్ హెచ్యూబి) : 13 పోస్టులు
2. గైనకాలజిస్ట్ (టెలి మెడిసిన్ హెచ్యూబి) : 3 పోస్టులు
3. పీడియాట్రిషియన్ (DEICs) : 14 పోస్టులు
4. మెడికల్ ఆఫీసర్లు ( UPHCs/UAAMs/DEICs/Tele Medical HUB) : 155 పోస్టులు
విద్యార్హతలు
అన్ని పోస్టులకు కనీసం ఎంబిబిఎస్ పూర్తిచేసివుండాలి. జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, పీడియాట్రిషియన్ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంగా డిప్లోమా ఉండాలి. APMC రిజిస్ట్రేషన్ కూడా కలిగివుండాలి.
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు APMC రిజిస్ట్రేషన్ తో కూడిన ఎంబిబిఎస్ ఉంటే చాలు.
వయో పరిమితి
ఓసి అంటే అన్ రిజర్వుడ్ అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడినాటికి 42 ఏళ్లలోపు వయసు ఉండాలి.
ఎస్సి, ఎస్టి, బిసి, ఆర్థికంగా వెనకబడిన తరగతులు (EWS) అభ్యర్థులు 47 ఏళ్ళలోపు వయసుండాలి.
వికలాంగులు అయితే 52 ఏళ్లలోపు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 50 ఏళ్లలోపు వయసువారు అర్హులు
దరఖాస్తు ప్రక్రియ
అన్ని అర్హతలు గల అభ్యర్ధులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్విసెస్ రిక్రూట్ మెండ్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://apmsrb.ap.gov.in/msrb/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు ఓసిలకు అయితే 1000 రూపాయలు... ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్స్, వికలాంగులకు అయితే 750 రూపాయలు. ఈ పేమెంట్ కూడా ఆన్లైన్ లో చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫారం పూర్తిచేశాక మరోసారి సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఈ అప్లికేషన్ పూర్తయినట్లు నిర్దారించే కాపీని డౌన్లోడ్ చేసుకొండి. భవిష్యత్ అవరసరాలకు ఇది ఉపయోగపడుతుంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 22 ఆగస్ట్ 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 10 సెప్టెంబర్ 2025న రాత్రి 11.59 PM వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అంటే ఎలాంటి రాత పరీక్ష ఉండదన్నమాట. మొత్తం 100 మార్కులకుగానే 75 శాతం క్వాలిఫికేషన్ విద్యార్హతలు (డిగ్రీ, పిజి) మార్కుల ఆధారంగానే కేటాయిస్తారు. డిప్లమా అభ్యర్థులకు విద్యార్హతల్లో 65 శాతం కేటాయిస్తారు. మిగతా మార్కులు వివిధ అంశాలను పరిశీలించి కేటాయిస్తారు.
సాలరీ
జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ వంటి స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగాలకు రూ.1,10,000 సాలరీ ఉంటుంది. ట్రైబర్ ప్రాంతాల్లో పనిచేసే పిడియాట్రిషియన్స్ కు రూ.1,40,000 జీతం ఉంటుంది. ఇక మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైనవారికి 61,960 రూపాయల సాలరీ ఉంటుంది.
పైన పేర్కొన్న ఉద్యోగాలను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన నియమిస్తున్నారు,