నెలకు రూ.1,77,500 జీతంతో గవర్నమెంట్ జాబ్స్ .. ఈ అర్హతలుంటే ఉద్యోగం మీదే
Government Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం. కేంద్ర ప్రభుత్వంలో లక్షల జీతంతో కూడిన ఉద్యోగాన్ని పొందు ఛాన్స్ వచ్చింది... ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.

NHAI లో ఉద్యోగాల భర్తీ
Central Government Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (National Highways Authority of India,NHAI) లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ, జీతం వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
NHAI లో పోస్టుల వారిగా ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- అకౌంటెంట్ - 42
- స్టెనోగ్రాఫర్ - 31
- డిప్యూటి మేనేజర్ (ఫైనాన్స్ ఆండ్ అకౌంట్స్) - 09
- లైబ్రరీ ఆండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 01
- జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ - 01
ముఖ్యమైన తేదీలు
- ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ - 30 అక్టోబర్ 2025
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ - 30 అక్టోబర్ 2025
- దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ - 15 డిసెంబర్ 2025
NHAI ఉద్యోగాలకు దరఖాస్తు విధానం, వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు https://nhai.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ చూడండి.
దరఖాస్తు ఫీజు
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఫీజు లేదు. జనరల్ కేటగిరీకి రూ. 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి
18 నుంచి 30 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 28 ఏళ్ళు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
NHAI జాబ్స్ కి విద్యార్హతలు
అకౌంటెంట్ :
డిగ్రీ పూర్తిచేసివుండాలి. చార్టెడ్ అకౌంటెన్సీ (CA) లేదా మేనేజ్మెంట్ అకౌంటెంట్ (CMA) లో కనీసం ఇంటర్మీడియట్ తప్పకుండా పూర్తిచేసివుండాలి.
స్టెనోగ్రాఫర్ :
బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసివుండాలి. ఇంగ్లీష్, హిందిలో టైప్ స్పీడ్ నిమిషానికి 80 పదాలుండాలి. కంప్యూటర్ ట్రాన్స్ క్రిప్షన్ టైమ్ ఇంగ్లీష్ లో అయితే 50 నిమిషాలు, హిందిలో 65 నిమిషాలు ఉండాలి.
డిప్యూటి మేనేజర్ (ఫైనాన్స్ ఆండ్ అకౌంట్స్) :
సాధారణ డిగ్రీతో పాటు ఫైనాన్స్ లో ఎంబిఐ పూర్తిచేసి వుండాలి.
లైబ్రరీ ఆండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ :
లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ పూర్తిచేసివుండాలి.
జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ :
హింది, ఇంగ్లీష్ సబ్జెక్టులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి వుండాలి.
ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ లేదా యూనివర్సిటీ నుంచి ఈ విద్యార్హతలు పొందివుండాలి.
NHAI ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
నాలుగు దశల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతుంది.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
NHAI ఉద్యోగాల సాలరీ
ఈ పోస్టులకు ఎంపికైన వారికి 7th CPC ప్రకారం సాలరీ లభిస్తుంది.
- అకౌంటెంట్ : నెలకు రూ.29,200 నుండి రూ.92,300 వరకు లభిస్తుంది
- స్టెనోగ్రాఫర్ : నెలకు రూ.25,500 నుండి రూ.81,100 వరకు లభిస్తుంది
- డిప్యూటి మేనేజర్ (ఫైనాన్స్ ఆండ్ అకౌంట్స్) : నెలకు రూ.56,100 నుండి రూ.1,77,500 వరకు లభిస్తుంది
- లైబ్రరీ ఆండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : నెలకు రూ.35,400 నుండి 1,12,400 వరకు లభిస్తుంది.
- జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ : నెలకు రూ.35,400 నుండి 1,12,400 వరకు లభిస్తుంది.