- Home
- Jobs
- Government Jobs : రాత పరీక్ష లేదు, అప్లై చేస్తే చాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. నెలనెలా రూ.1,60,000 సాలరీ
Government Jobs : రాత పరీక్ష లేదు, అప్లై చేస్తే చాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. నెలనెలా రూ.1,60,000 సాలరీ
Government Jobs : ఎలాంటి రాతపరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంకెందుకు ఆలస్యం… మీకు అన్ని అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్... కేంద్ర రోడ్డురవాణా, హైవే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. NHIDCL (National Highway and Infrastructure Development Corporation Limited) లో డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మీరు సివిల్ ఇంజనీరింగ్ చదివి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే ఇదే మంచి అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకొండి.
ఆసక్తికర విషయం ఏమిటంటే ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఈ నేషనల్ హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) లో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను పొందవచ్చు. కేవలం గేట్ స్కోర్ ఆధారంగానే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాబట్టి మీకు గేట్ లో మంచి స్కోరు ఉంటే అస్సలు ఆలస్యం చేయకండి... వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి.
NHIDCL లో భర్తీచేసే పోస్టుల వివరాలు
NHIDCL డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్ కేడర్) - మొత్తం 34 ఖాళీలున్నాయి. ఇందులో అన్ రిజర్వుడ్ 16 పోస్టులుండగా మిగతావి రిజర్వేషన్ ఉన్నారు. షెడ్యూల్ కులాలు (SC) - 04, షెడ్యూల్ తెగలు (ST) - 02, ఇతర వెనకబడిన తరగతులు (OBC) - 09, ఆర్థికంగా బలహీనవర్గాలు (EWS) -03 పోస్టులున్నాయి.
NHIDCL ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 04 అక్టోబర్ 2025
దరఖాస్తుకు చివరి తేదీ : 03 నవంబర్, 2025.
ఈ ఉద్యోగాలను పొందేందుకు అన్ని అర్హతలు కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nhidcl.com లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
NHIDCL ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి?
NHIDCL అధికారిక వెబ్‌సైట్ nhidcl.com లోకి వెళ్లండి.
Current Vacancies సెక్షన్‌లోకి వెళ్లి, సంబంధిత రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, పుట్టిన తేదీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయి, అప్లికేషన్ ఫారం నింపండి.
అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
ఏదైనా అప్లికేషన్ ఫీజు ఉంటే, దాన్ని చెల్లించి ఫారం సబ్మిట్ చేయండి.
చివరగా, అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ అవుట్ తీసుకోండి.
NHIDCL ఉద్యోగాల విద్యార్హతలు, వయోపరిమితి
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసి ఉండాలి. గేట్ క్వాలిఫికేషన్ తప్పనిసరి. అభ్యర్థులకు 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో ఏదైనా ఒకదానిలో చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ ఉండాలి.
అభ్యర్థి గరిష్ట వయసు 34 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
NHIDCL ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
నేషనల్ హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించదు. NHIDCL అభ్యర్థుల గేట్ స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి, దాని ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
NHIDCL డిప్యూటీ మేనేజర్ సాలరీ ఎంత?
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000 వరకు జీతం లభిస్తుంది. నియమితులైన అభ్యర్థులను రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంచుతారు. అవసరాన్ని బట్టి దీన్ని మరో రెండేళ్లు పొడిగించవచ్చు.
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను తప్పకుండా చదవాలి. దీనివల్ల అర్హత, రిజర్వేషన్, ఫీజు, ఇతర సూచనలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుస్తుంది.