- Home
- Jobs
- కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే కేంద్ర ప్రభుత్వం మీ ఖాతాలో రూ.15,000 వేస్తుంది, ఇలా దరఖాస్తు చేసుకోండి
కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే కేంద్ర ప్రభుత్వం మీ ఖాతాలో రూ.15,000 వేస్తుంది, ఇలా దరఖాస్తు చేసుకోండి
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 15000లను అందిస్తుంది. ప్రధానమంత్రి వికసిత్ భారత రోజ్ గార్ యోజన పథకం కింద దీనిని అందించబోతున్నారు. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి దేశంలోని యువతకు పెద్ద బహుమతినే ప్రకటించారు. దేశంలోని కోట్లాదిమంది యువతకు ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు బదులుగా ప్రైవేటు ఉద్యోగాల్లో చేరిన యువతకు 15వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించబోతోంది. ప్రైవేట్ రంగంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు మొదటి ఉద్యోగంలో చేరిన యువతీ యువకులకు ఈ డబ్బును అందించబోతున్నట్టు ప్రధాన మోడీ ప్రకటించారు.
ఏమిటి ఈ పథకం?
ప్రధానమంత్రి వికసిత్ భారత రోజ్గార్ యోజన అనేది ఉపాధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక పథకం. ఈ పథకంలో మొదటి ఉద్యోగం లో చేరిన యువతీ యువకులకు 15000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దీన్ని గతంలో ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ గా ప్రారంభించారు. ఇప్పుడు దాని పేరును వికసిత్ భారత్ రోజ్ గార్ యోజనగా మార్చారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ పథకాన్ని నిర్వహిస్తోంది.
ఎవరికి డబ్బులు ఇస్తారు?
ఈ ప్రభుత్వ పథకం కింద ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31 2027 మధ్య కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు 15 వేల రూపాయలను అందిస్తారు. కేవలం ప్రైవేటు ఉద్యోగాలలో చేరిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ప్రతినెలా జీవితంలో పిఎఫ్ కట్ అయ్యే ఉద్యోగాలు పొందిన వారికి మాత్రం ఈ 15 వేల రూపాయలు అందవు. అలాగే జీతం లక్ష రూపాయలు కంటే తక్కువగా ఉండాలి. ఈ పథకం కింద మీరు దరఖాస్తు చేసే చేస్తే 15000 రూపాయలను రెండు విడతలుగా మీ ఖాతాలో వేస్తారు. ఉద్యోగంలో చేరిన మొదటి ఆరు నెలల్లో రూ.7,500 తర్వాత 6 నెలలకి రూ.7500 చెల్లిస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకం కోసం యూఏఎన్ నెంబర్ ను జనరేట్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకోసం మీరు EPFOలో మీ పేరు వివరాలను నమోదు చేసుకోవాలి. మీరు EPFO లో వాటాదారుగా మారిన వెంటనే యూఏఎన్ నంబరు జనరేట్ అవుతుంది. యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ పథకంలో మీరు భాగస్తులు అవుతారు.
యాజమాన్యాలకు లాభం
కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత తమకు తాముగా ఈపీఎఫ్ఓలో ఈ పథకం కింద చేరలేరు. వారు చేరిన కంపెనీ ద్వారానే ఈ దరఖాస్తులను పూర్తి చేయాల్సి వస్తుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఉద్యోగాన్ని కల్పించిన సంస్థలకు కూడా దీనివల్ల లాభం ఉంటుంది.