MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Jobs
  • Career Guidance
  • Jobs : ఏఐ ఎంత అభివృద్ధి చెందినా ఈ ఉద్యోగాలకు ఢోకా ఉండదు ... అవేంటో తెలుసా?

Jobs : ఏఐ ఎంత అభివృద్ధి చెందినా ఈ ఉద్యోగాలకు ఢోకా ఉండదు ... అవేంటో తెలుసా?

కృత్రిమ మేధ (AI) ఎంట్రీతో అనేక రంగాల్లో మనుషుల అవసరం ఉండదని... చాలా ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఏఐ ప్రభావం ఉండని ఉద్యోగాల గురించి తెలిపారు. ఆ ఉద్యోగాలేమిటంటే.. 

Arun Kumar P | Updated : Mar 28 2025, 04:24 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Artificial Intelligence

Artificial Intelligence

ఈ టెక్ జమానాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)అద్భుతాలు చేస్తోంది... మనిషి సృష్టించిన ఈ టెక్నాలజీ మానవ మేధస్సునే డామినేట్ చేస్తోంది. తన సౌలభ్యంకోసం రూపొందించిన అత్యాధునిక టెక్నాలజీ ఇప్పుడు మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది... ఈ ఏఐ కూడా అలాంటిదే అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయితే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే వాదన వుంది.  ఇలా ఏఐ వల్ల సామాన్య ఉద్యోగులే కాదు ఆయా రంగాల్లో నిపుణులు కూడా రోడ్డునపడే ప్రమాదముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

ఏఐ టెక్నాలజీ ఉపయోగాలు ఏమోగాని దుష్పరిణామాలపైనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ ఏఐ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఇది ఏయే రంగాలపై ప్రభావం చూపుతుందో కాదు ఏ రంగాలపై ప్రభావం చూపలేదో వివరించారు. ఏఐ ఎంతలా  అభివృద్ధి చెందినా ఓ మూడు రంగాలను మాత్రం ప్రభావితం చేయలేదని బిల్ గేట్స్ పేర్కొన్నారు. కాబట్టి ఆ రంగాల్లోని ఉద్యోగులు ఏఐ గురించి ఆందోళన చెందకుండా నిశ్చింతంగా ఉండవచ్చని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

23
Artificial Intelligence

Artificial Intelligence

ఏఐ ఏం చేయలేని మూడు ఉద్యోగాలివే : 

1. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు : 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సృష్టించిందే ఈ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ. అలాంటిది ఈ రంగంలో ఉద్యోగాలనే ఏఐ మింగేసే ప్రమాదం ఉందని... భారీగా టెకీలు ఎఫెక్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ బిట్ గేట్స్ మాత్రం సాప్ట్ వేర్ ఉద్యోగులపై ఏఐ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు. 

సాధారణ ప్రోగ్రామింగ్ పనులకు ఏఐ ఉపయోగపడవచ్చు... కానీ కోడింగ్ వంటి క్లిష్టమైన పనుల్లో ఏఐ పనిచేయదు. కోడింగ్ చేయాలంటే చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి... ఖచ్చితత్వం చాలా ముఖ్యం. ఏమాత్రం అటు ఇటు అయినా కష్టమే.  కాబట్టి మనుషులు చేసేంత పర్ఫెక్ట్ గా ఏఐ కోడింగ్ చేయలేదు... ఏదయినా కోడింగ్ సమస్య వచ్చినా ఏఐ పరిష్కరించలేదు... కాబట్టి సాప్ట్ వేర్ ఉద్యోగాల్లో మనుషుల అవసరం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి సాప్ట్ వేర్ ఉద్యోగులు సేఫ్ అనేలా బిల్ గేట్స్ కామెంట్స్ చేసారు. 

2. ఎనర్జీ రంగం :  

ప్రస్తుతం ఎనర్జీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సాంప్రదాయ ఇందన వనరులతో సరికొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణానికి హాని కలిగించకుండా ఉండే పునరుత్పాదక ఇందన వనరులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎనర్జీ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎనర్జీ రంగ నిపుణుల మాదిరిగా ఏఐ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోలేదు...  దీంతో ఈ రంగంలో ఉద్యోగాలను కొనసాగించక తప్పదు. 

33
Artificial Intelligence

Artificial Intelligence

 జీవశాస్త్రం (Life sciences): 

ఈ రంగంలో కూడా మానవ అవసరాన్ని ఏఐ తీర్చలేదు. ఢాటా విశ్లేషణ, వ్యాధి నిర్దారణ వంటి పనులకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడవచ్చు... కానీ వైద్య పరిశోధనల్లో ఇది ఏమాత్రం ఉపయోగడదని బిల్ గేట్స్ అన్నారు. వైద్య పరిశోధనలో చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటారు... పరిశోధకుల ఆలోచనా ధోరణి, నైపుణ్యాలను బట్టి రిజల్ట్ ఉంటుంది. ఏఐ సృజనాత్మకంగా ఆలోచించలేదు... అలాగే మానవ ఎమోషన్స్ కు తగ్గట్లు వ్యవహరించలేదు. కాబట్టి వైద్యశాస్త్ర పరిశోధనలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండదనేది బిల్స్ గేట్స్ అభిప్రాయం. 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఉద్యోగాలు, కెరీర్
విద్య
 
Recommended Stories
 రూ. కోట్లలో జీతం రావాలంటే.. ఈ కోర్సులు చేయాలి
రూ. కోట్లలో జీతం రావాలంటే.. ఈ కోర్సులు చేయాలి
ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగ రేటు 5.1%..
ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగ రేటు 5.1%..
CBSE Class 10 official result: సీబీఎస్ఈ బోర్డు కీలక ప్రకటన
CBSE Class 10 official result: సీబీఎస్ఈ బోర్డు కీలక ప్రకటన
Top Stories