- Home
- Jobs
- Career Guidance
- BHEL Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఈఎల్ లో ఉద్యోగాల భర్తీ ... ఈ అర్హతలుంటే మీదే జాబ్
BHEL Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఈఎల్ లో ఉద్యోగాల భర్తీ ... ఈ అర్హతలుంటే మీదే జాబ్
బిహెచ్ఈఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హతలు, దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.

BHEL Recruitment
BHEL Recruitment : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఈఎల్) ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద కంపనీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే హెవీ ఎలక్ట్రికల్స్ వస్తువుల తయారీ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 400 పోస్టులను భర్తీచేయనున్నట్లు ప్రకటించారు.
బిహెచ్ఈఎల్ ట్రైనీ ఇంజనీర్లు, సూపర్వైజర్లను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ. వచ్చే నెల ఫిబ్రవరిలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. BHEL లో ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అర్హతలు, దరఖాస్తూ విధానం, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
BHEL లో విభాగాల వారిగా భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు :
ట్రైనీ ఇంజనీర్స్ :
1. మెకానికల్ విభాగంలో మొత్తం ఖాళీలు 70 (అన్ రిజర్వుడ్ 28, ఈడబ్ల్యూఎస్ 7, ఓబిసి 20, ఎస్సి 10, ఎస్టి 5)
2. ఎలక్ట్రికల్ విభాగంలో మొత్తం 25 ఖాళీలు వున్నాయి.(అన్ రిజర్వుడ్ 10, ఈడబ్ల్యూఎస్ 2, ఓబిసి 7, ఎస్సి 4, ఎస్టి 2)
3. సివిల్స్ విభాగంలో మొత్తం ఖాళీలు 25.(అన్ రిజర్వుడ్ 10 , ఈడబ్ల్యూఎస్ 2, ఓబిసి 7, ఎస్సి 4, ఎస్టి 2)
4. ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొత్తం ఖాళీలు 20. (అన్ రిజర్వుడ్ 8 , ఈడబ్ల్యూఎస్ 2, ఓబిసి 5, ఎస్సి 3, ఎస్టి 2)
5. కెమికల్ విభాగంలో మొత్తం ఖాళీలు 5. (అన్ రిజర్వుడ్ 2 , ఈడబ్ల్యూఎస్ 1, ఓబిసి 1, ఎస్సి 1, ఎస్టి 0)
6. మెటలర్జీ విభాగంలో మొత్తం ఖాళీలు 5. (అన్ రిజర్వుడ్ 2 , ఈడబ్ల్యూఎస్ 1, ఓబిసి 1, ఎస్సి 1, ఎస్టి 0)
ఇలా మొత్తం 150 ట్రైనీ ఇంజనీర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 60 అన్ రిజర్వుడ్ కాగా మిగతావాటిలో ఈడబ్ల్యూఎస్ 15, ఓబిసి 41, ఎస్సి 23, ఎస్టి 11 పోస్టులు వున్నాయి.
bhel
సూపర్వైజర్ ట్రైనీ (టెక్) ఉద్యోగాలు :
1. మెకానికల్ విభాగంలో మొత్తం ఖాళీలు 140. (అన్ రిజర్వుడ్ 64 , ఈడబ్ల్యూఎస్ 14, ఓబిసి 30, ఎస్సి 22, ఎస్టి 10)
2. ఎలక్ట్రికల్స్ విభాగంలో మొత్తం ఖాళీలు 55. (అన్ రిజర్వుడ్ 24 , ఈడబ్ల్యూఎస్ 3, ఓబిసి 15, ఎస్సి 10, ఎస్టి 3)
3. సివిల్స్ విభాగంలో మొత్తం ఖాళీలు 35. (అన్ రిజర్వుడ్ 13 , ఈడబ్ల్యూఎస్ 4, ఓబిసి 10, ఎస్సి 5, ఎస్టి 3)
4.ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొత్తం ఖాళీలు 20. (అన్ రిజర్వుడ్ 10 , ఈడబ్ల్యూఎస్ 2, ఓబిసి 5, ఎస్సి 2, ఎస్టి 1)
ఇలా మొత్తం 250 సూపర్వైజర్ ట్రైనీ (టెక్)
పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 111అన్ రిజర్వుడ్ కాగా మిగతావాటిలో ఈడబ్ల్యూఎస్ 23, ఓబిసి 60, ఎస్సి 39, ఎస్టి 17 పోస్టులు వున్నాయి.
విద్యార్హతలు :
ట్రైనీ ఇంజనీర్ పోస్టులు :
ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీలో లో డ్యుయల్ డిగ్రీ చేసినవారు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థనుండి ఈ డిగ్రీలు పొందివుండాలి.
సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు :
కనీసం 65 శాతం మార్కులతో డిప్లమా ఇన్ ఇంజనీరింగ్ పూర్తిచేసి వుండాలి. ఎస్సి, ఎస్టి అభ్యర్థులు మాత్రం 60 శాతం మార్కులతో పాసయినా అర్హులే.
దరఖాస్తు ప్రక్రియ :
ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 01, 2025 నుండి ప్రారంభం అవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ ఫిబ్రవరి 28, 2025. ఆన్ లైన్ లో BHEL అధికారిక వెబ్ సైట్ http://careers.bhel.in ద్వారా ఫిబ్రవరి 1 నుండి దరఖాస్తు చేసుకోవాలి.
జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.795 దరఖాస్తు ఫీజు వుంటుంది. ఇక ఎస్సి, ఎస్టి అభ్యర్థులు కేవలం రూ.295 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చ.
ఎంపిక ప్రక్రియ :
BHEL లో ట్రైనీ ఇంజనీర్, సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కంప్యూటర్ బెస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇందులో మంచి మార్కులు సాధించవారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అందులోనూ మంచి ప్రతిభ కనబర్చినవారిని ఎంపికచేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి :
డిగ్రీలు లేకున్నా పర్వాలేదు... ఈ షార్ట్ టర్మ్ కోర్సులు చేసారంటే లక్షలు సంపాదించే ఉద్యోగాలు
Andhra Pradesh Jobs : ఏకంగా 26,263 పోస్టులు ఖాళీ ... 10 వేల ఉద్యోగాల భర్తీకి అంతా సిద్దం