MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Jobs
  • Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఏకంగా 13,700 టీచర్ పోస్టులు

Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఏకంగా 13,700 టీచర్ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా టీచర్ పోస్టులు భర్తీ జరగాల్సి ఉంది. నవోదయ స్కూళ్లలో 13,700కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది.

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 19 2026, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీచర్ ఉద్యోగాల భర్తీ..
Image Credit : Getty

టీచర్ ఉద్యోగాల భర్తీ..

కేంద్రీయ విద్యాలయ (KV), జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) భారీ సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ రెండు విద్యాసంస్థల్లో కలిపి మొత్తం 13,701 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం టీచర్ల ఖాళీలపై లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేంద్రీయ స్కూళ్లలో ఖాళీల వివరాలు
Image Credit : Asianet News

కేంద్రీయ స్కూళ్లలో ఖాళీల వివరాలు

కేంద్ర మంత్రి విడుదల చేసిన డేటా ప్రకారం... కేవలం ఒక్క కేంద్రీయ విద్యాలయాల్లోనే 8,618 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జవహర్ నవోదయ విద్యాలయాల్లో 5,083 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ స్కూళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండటం విద్యావేత్తల్లో ఆందోళన కలిగిస్తోంది.

Related Articles

Related image1
Government Jobs : కేవలం 10వ తరగతి అర్హతతో.. రూ.50 వేల వరకు జీతంగల 10 రకాల ప్రభుత్వ ఉద్యోగాలివే
Related image2
AI Jobs : ఇక సాప్ట్ వేర్ల స్థానంలో ఈ ఉద్యోగాలు... ఇందుకోసం చేయాల్సిన కోర్సులివే..
35
ఖాళీలకు కారణాలేంటి?
Image Credit : Gemini AI

ఖాళీలకు కారణాలేంటి?

టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటానికి మంత్రి కొన్ని కారణాలు చెప్పారు

• కొత్త స్కూళ్లు ప్రారంభించడం, ఉన్నవాటిని అప్‌గ్రేడ్ చేయడం.

• టీచర్ల రిటైర్మెంట్, రాజీనామాలు, ప్రమోషన్లు.

• విభాగాల వారీగా బదిలీలు.

విద్యార్థుల అడ్మిషన్లు, అవసరాలకు తగ్గట్టుగా టీచర్ల నియామకం జరగకపోవడమే ఈ గ్యాప్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.

45
త్వరలోనే ఖాళీల భర్తీ
Image Credit : Asianet News

త్వరలోనే ఖాళీల భర్తీ

ప్రస్తుతం ఉన్న టీచర్ల కొరత వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా, ఖాళీ పోస్టుల్లో తాత్కాలిక (కాంట్రాక్టు) టీచర్లను నియమించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు ఈ కాంట్రాక్టు టీచర్లే క్లాసులు తీసుకుంటారు. అయితే ఈ ఖాళీలను భర్తీ చేయడం అనేది నిరంతర ప్రక్రియ అని, నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగా నింపేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు.

55
విద్యా ప్రమాణాలపై ప్రభావం ఉంటుందా?
Image Credit : Getty

విద్యా ప్రమాణాలపై ప్రభావం ఉంటుందా?

టీచర్ల కొరత ఉన్నప్పటికీ, పబ్లిక్ పరీక్షల్లో కేంద్రీయ విద్యాలయ, నవోదయ స్కూల్ విద్యార్థులు సాధిస్తున్న అద్భుతమైన ఉత్తీర్ణత శాతమే విద్యా ప్రమాణాలు బాగున్నాయని చెబుతోందని మంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పర్మినెంట్ టీచర్లను త్వరగా నియమించడానికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన పార్లమెంటులో తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
విద్య
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Govt Job : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, ఎగ్జామ్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Recommended image2
Jobs : తెలుగమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్
Recommended image3
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Related Stories
Recommended image1
Government Jobs : కేవలం 10వ తరగతి అర్హతతో.. రూ.50 వేల వరకు జీతంగల 10 రకాల ప్రభుత్వ ఉద్యోగాలివే
Recommended image2
AI Jobs : ఇక సాప్ట్ వేర్ల స్థానంలో ఈ ఉద్యోగాలు... ఇందుకోసం చేయాల్సిన కోర్సులివే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved