- Home
- International
- USA: అమెరికాలో చదువుతోన్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా? ట్రంప్ ఏం చేయనున్నారు, ఎలాంటి నిబంధనలు తేనున్నారు
USA: అమెరికాలో చదువుతోన్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా? ట్రంప్ ఏం చేయనున్నారు, ఎలాంటి నిబంధనలు తేనున్నారు
Birthright citizenship: అగ్రరాజ్యం అమెరికాలో చదువుకోవాలి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలి, అదృష్టం ఉంటే గ్రీన్ కార్డ్ పొందాలి.. ఇదిగో ఇది చాలా మంది కల. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆశలకు గండి కొట్టేలా కనిపిస్తున్నట్లు పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మరోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అసలేం చేయబోతున్నారన్న అంశాలకు సంబంధించిన వివరాలను అమర్‌నాథ్ వాసి రెడ్డి ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ఈ వివరాలు మీకోసం..

Donald trump
వేరే దేశానికి పోవాలంటే పాస్పోర్ట్ , వీసా ఉండాలి. ఇవేవీ లేకుండా ... ఇమ్మిగ్రేషన్ దారిలో వెళ్లకుండా... సరిహద్దు వద్ద దొంగతనంగా ఒక దేశంలోకి ప్రవేశించే వారిని ...అక్రమ వలసదారులు అంటారు. అమెరికా లో అక్రమ వలసదారుల సంఖ్య ఒక కోటి దాటింది . వారి మొత్తం జనాభా 33 కోట్లు. ఏటా మూడు లక్షల మంది ... కొత్తగా అక్రమ పద్ధతుల్లో వలస వస్తున్నారు. మెక్సికో , కెనడా సరిహద్దు నుంచి వీరు అమెరికాలోకి చొరబడుతున్నారు. అక్రమ వలసదారుల్లో మెక్సికన్లు ఎక్కువ. మెక్సికో తరువాత ఎల్ సాల్వడార్ మూడో స్థానంలో ఇండియా ఉంది.
అమెరికాలో చొరబడ్డాక వారు అక్రమ వలసదారులయినా వారికి సంతానం కలిగితే ఆ నేల పై పుట్టిన బిడ్డ... అక్కడి పౌరుడు అయిపోతారు. ఇలా సంవత్సరం లక్షల్లో ఇతర దేశాల వారు వచ్చి... ఇక్కడ నిరుద్యోగం నేరాలు పెరగడానికి కారణం అవుతున్నారనేది... ట్రంప్ మాట . అందుకే అలాంటి వారి పిల్లలకు సహజంగా పౌరసత్వం వచ్చే వీలు లేదని ఆర్డర్ ఇచ్చాడు. ఇది వారి రాజ్యాంగానికి వ్యతిరేకం. అందుకే దానిపై స్టే వచ్చింది. ఇప్పుడు ట్రంప్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి . ఒకటి రాజ్యాంగ సవరణ . అమెరికాలో రాజ్యాంగ సవరణ దాదాపు అసాధ్యం. యాబై రాష్ట్రాల్లో నలబై ఒప్పుకోవాలి. ఇది అయ్యే పని కాదు .
రెండోది సుప్రీం కోర్ట్ లో కేసు గెలవాలి. రాజ్యాంగ సవరణ... ఆనాడు బానిసలుగా ఉన్న వారి పిల్లల కోసం ఈ చట్టం చేశారని , దీన్ని అడ్డుపెట్టుకొని అన్ని దేశాల వారు ఇక్కడకు వచ్చి పౌరులు అయిపోవడం సమ్మతం కాదని ట్రంప్ చెబుతున్నాడు. "ఇది ఇలాగే కొనసాగితే దేశ శాంతి భద్రతలకు... సార్వభౌమత్వానికి ముప్పు .. ప్రపంచం లో తిరుగులేని శక్తిగా ఉన్న అమెరికా ఇంటి ఓడిపోతుందని" ట్రంప్ తరపున సుప్రీమ్ కోర్ట్ లో వాదనలు ఉంటాయి. అమెరికాకు ఏటా ఉన్నత విద్య కోసం వెళ్లే ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య పది లక్షలు పై మాటే . వీరిలో అధిక శాతం అక్కడే స్థిరపడడానికి ప్లాన్ చేసుకొంటారు. అక్రమ వలస... సక్రమ వలస .. అన్నీ కలిపి అమెరికాలో ఇరత దేశాలకు చెందిన వారి సంఖ్య సుమారుగా అయిదు కోట్లు. అంటే అమెరికా లో ప్రతి వంద మందికి 15 మంది విదేశీయులే. దీనికి తోడు 15 లక్షల మంది ప్రతి ఏటా తోడవుతున్నారు . ఇది ఇలాగే కొనసాగితే మరో నలబై ఏళ్లలో అమెరికా లో విదేశీయుల సంఖ్య మెజారిటీ అంటే యాభై శాతం దాటి పోతుంది .
సుప్రీమ్ కోర్ట్ లో ఓడిపోతే ట్రంప్ ఏమి చేయవచ్చు ?
1 . సరిహద్దులో నిఘా . అక్రమ వలసదారులు తిరిగి పంపేయడం .
2 . అమెరికా లో చదివే విద్యార్థులు ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు . చదువు అయిపోయిన వెంటనే తిరిగీ వెళ్లి పోవాలి... అని కొత్త నిబంధన తేవడం .
౩. స్టూడెంట్ వీసా పై ఉన్నవారిని .. అక్రమ వలసదారులను... పనిలో పెట్టుకొనే సంస్థల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయొచ్చు. యజమానులన్ని భాద్యుల్ని చేయడం. ఇప్పుడైతే ప్రతి షాప్ కు వెళ్లి చెక్ చెయ్యాలి . కృత్రిమ మేధ సాయం తీసుకొంటే .. ఒక్కో సంస్థలో ఉద్యోగులు ఎంత మంది ? వారిలో స్టూడెంట్ వీసా... అక్రమ వలసదారులు ఎంతమంది? అనేది క్షణాలో తెలిసిపోతుంది. విద్యార్ధి వీసా పై వచ్చిన వారు ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు అంటే అమెరికా లో సగానికి పైగా ఉన్నత విద్యా సంస్థలు మూసేసుకోవాలి .
అలాగని ఇప్పటి లాగా అనుమతిస్తే ఏటా పది లక్షల విద్యార్థులు కొత్తగా వస్తారు . అమెరికన్స్ కు ఉద్యోగాలు దొరకవు . ఇప్పటికే 23 లక్షల అమెరికన్ యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వీటన్నింటికి మించి ఇంకో ఉపద్రవం ఉంది. కొన్ని కన్సల్టెన్సీ లు బోగస్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాయి . బిటెక్‌లో సబ్జక్ట్స్ బ్యాక్ లాగ్ పెట్టుకొని సెకండ్ ఇయర్ దాటక పోయినా మాయా పద్ధతుల్లో అమెరికాకు వెళ్ళిపోయి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు . దీనితో సక్రమ పద్ధతిలో ట్రై చేసేవారికి ఉద్యోగాలు దొరకని స్థితి. కొత్తగా చర్యలు చేబడితే అనేక యూనివర్సిటీలు మూసేసుకోవాలి. చేపట్టకపోతే అమెరికన్స్ లో వ్యతిరేకత. మింగితే ఒక సమస్య, కక్కితే ఇంకో సమస్య. ముందు నుయ్యి .. వెనుక గొయ్యి అన్నట్లు పరిస్థితి మారుతుంది.
అమెరికాను "జాతులు ఉడికే కుండ" అనేవారు .. అంటే అక్కడ అన్ని జాతుల వారు ఒక్కటై పోతారు .. మనుషులంతా ఒక్కటే అనేది ఇక్కడ ఆచరణలో కనిపిస్తుంది... అనేది దీని భావం .
ఇప్పుడు నిజంగానే అమెరికా కుతకుత ఉడికే కుండ అయిపొయింది . జాతులు కలిసిపోవడం కాదు . వాటి మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా వైరుధ్యం వస్తోంది. శ్వేత జాతి వారు.. ఎన్నో ఏళ్ళ క్రితం అక్కడికి వెళ్లి స్థిరపడిన వారు . అక్కడే పుట్టి పౌరసత్వం పొందిన వారు .. కొత్తగా వలస వచ్చే వారు .. అందులో సక్రమ పద్ధతిలో వచ్చేవారు .. అక్రమ వలసదారులు .. ఇన్ని గ్రూప్స్ .. అమెరికా ఎన్నో యుద్ధాల్ని గెలిచింది . ఇది కూడా యుద్ధం లాంటిదే . గెలుస్తుందా ? చూడాలి.
వాసిరెడ్డి అమర్‌నాథ్ ఫేస్ పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..