- Home
- International
- Russia Ukraine Crisis :యుద్ధ సైరన్లే...పెళ్లి బాజాలుగా ఒక్కటైన జంట... ‘చనిపోయే ముందు కలిసుండాలనుకుంటున్నాం’..
Russia Ukraine Crisis :యుద్ధ సైరన్లే...పెళ్లి బాజాలుగా ఒక్కటైన జంట... ‘చనిపోయే ముందు కలిసుండాలనుకుంటున్నాం’..
‘పరిస్థితులు బాగాలేవని మాకు తెలుసు. మాతృభూమి కోసం పోరాడబోతున్నాం" అని అరివా అన్నారు, "బహుశా మేం చనిపోవచ్చు, అయితే.. అన్నింటికంటే ముందు మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం" అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

Ukrainian couple
రష్యా భయానక దాడిలో ఉక్రెయిన్ వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతగా నిరసనలు వచ్చినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ రాజధానిని ఆక్రమించుకునే దిశగా చొచ్చుకుపోతోంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యాలయాల మీద రష్యా జెండా ఎగరవేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఓ వివాహ వేడుక చర్చనీయాంశంగా మారింది.Ukrainian couple
Ukrainian couple
దేశవ్యాప్తంగా వినిపిస్తున్న వైమానిక దాడి సైరన్లే పెళ్లి బాజాలుగా ఓ జంట చర్చిలో ఏకమయ్యింది. ఓ ఉక్రేనియన్ జంట కైవ్‌లోని ఒక చర్చ్ లో వివాహం చేసుకున్నారు. వారు ముందుగా ఈ పెళ్లి కోసం ఎంతో ప్లాన్ చేసుకున్నారు. పావురాలను ఎగరవేయడం, స్నేహితులు, బంధువులతో చర్చ్ లోకి వెళ్లడం.. వారికి పెద్దగా విందు ఇవ్వడం..లాంటివి. కానీ అంతా తలకిందులయ్యింది.
Ukrainian couple
వారికి చర్చిలోని పావురాల కూతలే పెళ్లి స్వాగతాలయ్యాయి. పెళ్లి తరువాత బయటికి వచ్చేప్పుడు యుద్ధసైరన్ల మోతాలు కొత్త జీవితానికి స్వాగతం పలికాయి. తమ దేశం యుద్ధంలో ఉందని వీరికి తెలుసు కానీ యారినా అరివా, ఆమె భాగస్వామి స్వియాటోస్లావ్ ఫర్సిన్‌కి వేరే మార్గం లేదు. ‘పరిస్థితులు బాగాలేవని మాకు తెలుసు. మాతృభూమి కోసం పోరాడబోతున్నాం" అని అరివా అన్నారు, "బహుశా మేం చనిపోవచ్చు, అయితే.. అన్నింటికంటే ముందు మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం" అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
Ukrainian couple
ఈ జంట మొదటిసారి అక్టోబర్ 2019లో కైవ్ మధ్యలో జరిగిన నిరసనలో కలుసుకున్నారు. ముందుగా వీరు మే 6న వివాహం చేసుకుని, రష్యాలోని వాల్డై హిల్స్‌లోని డ్నీపర్ నదికి ఎదురుగా ఉన్న రెస్టారెంట్‌లో వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, పుతిన్ గురువారం తమ దేశంపై పూర్తిస్థాయి దాడిని ప్రారంభించడంతో, ఈ జంట వెంటనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Ukrainian couple
యుద్ధపు రెండో రోజు రష్యా తీవ్రతను ఇంకా పెంచినందున ఈ జంట చాలా పకడ్భందీగా ప్లాన్ చేసి, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2019లో కీవ్ లో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆ తరువాతి నుంచి ప్రేమలో పడ్డారు.