మెదడు తినే అమీబా సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. అమెరికాలో షాకింగ్ ఘటన....
అమెరికాలో మెదడు తినే అమీబా సోకి ఓ రెండేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డాడు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించాడు.
అమెరికా : యునైటెడ్ స్టేట్స్‌లోని నెవాడాలో ఓ రెండేళ్ల బాలుడు నెగ్లేరియా ఫౌలెరి ఇన్‌ఫెక్షన్‌తో మరణించాడు. ఈ ఇన్ ఫెక్షన్ ను దీనిని సాధారణంగా "మెదడు తినే అమీబా" అని పిలుస్తారు. ఈ ఘటన జూలై 19న వెలుగు చూసింది.
ఆ బాలుడి పేరు వుడ్రో టర్నర్ బండీ. న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం, "నీటిలో ఆడుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ అతని శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని" వుడ్రో బండీ కుటుంబం నమ్ముతుంది.
ఈ హృదయ విదారక వార్తను బాలుడి తల్లి ఫేస్‌బుక్‌లోకి షేర్ చేసింది. ‘రెండేళ్ల మా అబ్బాయి ఉడ్రో టర్నర్ బండి 2:56 గంటలకు స్వర్గంలో ఉన్న మా తండ్రి దగ్గరికి వెళ్లాడు. 7 రోజులపాటు మృత్యువుతో పోరాడాడు. ఈ అమీబా సోకిన తరువాత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి టర్నరే. నా కుమారుడు అత్యంత బలమైనవాడని నాకు తెలుసు" అని బ్రియానా రాసుకొచ్చింది.
"అతను నా హీరో, నాకు మంచి మగబిడ్డను ఇచ్చినందుకు నేను దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అతను స్వర్గానికే వెళ్లి ఉంటాడు కాబట్టి నేను కృతజ్ఞుడను" అని మరింత వివరంగా తెలిపింది. వీరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ చేసిన సోషల్ మీడియా పోస్టులను బట్టి.. గత వారం ఆ చిన్నారికి "ఫ్లూ లాంటి లక్షణాలు" కనిపించాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు, అక్కడ వైద్య సిబ్బంది మొదట అది మెనింజైటిస్ అనుకున్నారు.
తరువాత, ఈ సంవత్సరం ప్రారంభంలో విస్తృతంగా ఆందోళన కలిగించిన ప్రాణాంతక మెదడు తినే అమీబా అతనికి సోకందని కనుగొన్నారు. ఈ యేడు మొదట్లో ఇది ఫిబ్రవరి 2023లో యూఎస్ లో 50 ఏళ్ల వయస్సు వ్యక్తిని బలితీసుకుంది.
ఈ సంఘటనకు రెండు రోజుల ముందు, బ్రియానా ఫేస్‌బుక్ పోస్ట్‌లో, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) రెండేళ్ల చిన్నారికి చికిత్స అందించడానికి నిరాకరించిందని పేర్కొంది. ప్రాణాలతో బయపటపడడం కష్టం అని పేర్కొన్నారని తెలిపింది. ఆమె ఆరోపణలపై ఆరోగ్య సంస్థ స్పందించలేదు.
సీడీసీ ప్రకారం, నేగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటి వెచ్చని మంచినీటి వాతావరణాలలో కనిపించే ఒక రకమైన అమీబా (ఏకకణ జీవి). ఈ అమీబా ఉన్న నీరు ముక్కులోకి వెళ్లినప్పుడు.. మెదడుకు సోకుతుంది. కాబట్టి దీనిని బ్రెయిన్-ఈటింగ్ అమీబా అని కూడా అంటారు. ఇది అరుదైన వ్యాధి, అయినప్పటికీ, ఇది ప్రాణాంతకం.
నాగ్లేరియా ఫౌలెరీ ఉన్న నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు, అమీబా ముక్కు ద్వారా మెదడుకు వలస వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కలుషిత నీరు ముక్కు పై భాగానికి వెళ్లకపోతే రోగాల బారిన పడరని గమనించాలి. నేగ్లేరియా-ఉన్న నీరు పీల్చిన ఒకటి నుండి 12 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.సీడీసీ ప్రకారం, లక్షణాలు కనిపించిన తర్వాత ఒకటి నుండి 18 రోజుల వరకు వ్యక్తులు మరణిస్తారు. తీవ్రమైన ఫ్రంటల్ తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ గట్టిపడటం, మూర్ఛలు, భ్రాంతులు, కోమా అమీబా వల్ల కలిగే కొన్ని లక్షణాలు.