- Home
- International
- రచయిత ఇ జీన్ కారోల్‌పై ట్రంప్ లైంగిక వేధింపులు నిజమే.. 5 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే.. జ్యూరీ తీర్పు..
రచయిత ఇ జీన్ కారోల్‌పై ట్రంప్ లైంగిక వేధింపులు నిజమే.. 5 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే.. జ్యూరీ తీర్పు..
ట్రంప్ తన మీద అత్యాచారం చేశాడని ఆరోపించిన రచయిత కారోల్ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. ట్రంప్ ఆమెకు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని తెలిపింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అమెరికా : 1990వ దశకంలో కాలమిస్ట్ ఇ జీన్ కారోల్‌ను లైంగికంగా వేధించినందుకు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం బాధ్యత వహించారు, దీంతో జ్యూరీ ఆమెకు 5 మిలియన్ల డాలర్లను ఇవ్వాలని తెలిపింది. ఈ ఘటన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రచారానికి గొడ్డలిపెట్టగా మారే అవకాశం ఉంది. క్యారోల్‌ను అబద్ధాలకోరుగా పేర్కొంటూ ట్రంప్ పరువు తీశారని కూడా జ్యూరీ పేర్కొంది.
ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడి న్యాయవాది టకోపినా, ట్రంప్ ఈ తీర్పు మీద మళ్లీ అప్పీలు చేస్తారని విలేకరులతో అన్నారు. 1995 లేదా 1996లో మాన్‌హట్టన్‌లోని బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్, తనపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత అక్టోబర్ 2022లో తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా ఆమె ప్రతిష్టకు హాని కలిగించిందని కారోల్ (79), సివిల్ విచారణలో వాంగ్మూలం ఇచ్చాడు. ఆమె వేసిన దావాలు "పూర్తి కాని ప్రయత్నం," "బూటకం", "అబద్ధం" అని అన్నారు.
తీర్పును అనుసరించి, కారోల్ ఒక ప్రకటనలో, "చివరకు ఈ రోజు, ప్రపంచానికి నిజం తెలిసింది. ఈ విజయం నాకే కాదు, నమ్మకం కోల్పోయి బాధపడిన నాలాంటి ప్రతి స్త్రీది’’ అని పేర్కొన్నారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన విచారణకు గైర్హాజరైన ట్రంప్, తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్‌లో, ఈ తీర్పును "అవమానకరం" అన్నారు. "ఈ మహిళ ఎవరో నాకు అస్సలు తెలియదు" అన్నారు.
ఈ కేసులో ట్రంప్ మీద క్రిమినల్ చర్యలేవీ ఉండవు. ఇది సివిల్ కేసు అయినందున జైలు శిక్ష కూడా లేదు. దీనిమీద జ్యూరీ కేవలం మూడు గంటలలోపు చర్చించి ఏకగ్రీవ తీర్పు నిచ్చింది. ఈ జ్యూరీలోని ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు కారోల్‌కు 5 మిలియన్ డాలర్ల పరిహారం, శిక్షాత్మక నష్టపరిహారం అందించాలన్నారు. అయితే, కేసు అప్పీల్‌లో ఉన్నంత కాలం ట్రంప్ ఈ సొమ్మును చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ట్రంప్‌పై లైంగిక వేధింపులు లేదా వేధింపుల ఆరోపణలు చేసిన డజనుకు పైగా మహిళల్లో కారోల్ ఒకరు. మాన్‌హాటన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో తనపై ట్రంప్ అత్యాచారం చేశాడని 2019 మెమోయిర్‌లో ఆమె బహిరంగంగా ఆరోపణలు చేసింది. ట్రంప్ ఆరోపణలను ఖండించారు.
అయితే, దుకాణంలో కరోల్‌ను తాను ఎప్పుడూ చూడలేదని, ఆమె గురించి తనకు తెలియదని అన్నారు. ఆమె అబద్దాల కోరు అని ఆరోపించారు.
కారోల్ తనకు నష్టపరిహారం కావాలని కోరింది, దానితో పాటు ఆమె తన ఆరోపణల మీద ట్రంప్ తన పరువు నష్టం కలిగించేలా వ్యవహరించారని దీని నుంచి తనకు ఉపసంహరణ కావాలని కోరింది.