అందంగా కనిపిస్తారు కానీ ఆయన కిల్లర్.. నరేంద్ర మోదీపై ట్రంప్ వ్యాఖ్యలు
Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ తన స్నేహితుడు అని చెప్పే ట్రంప్ ఈసారి మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ అందంగా కనిపించే వ్యక్తి అని కానీ చాలా కఠినమైన నాయకుడు అంటూ కామెంట్స్ చేశారు.

మోదీపై ట్రంప్ ప్రశంసలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. “మోదీ ప్రపంచంలోనే అందంగా కనిపించే వ్యక్తి, కానీ కఠినమైన నాయకుడు. ఆయన ఒక ‘కిల్లర్’, అంటే ఎంతైనా దృఢంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడు” అని అన్నారు. తాను మోదీని గౌరవిస్తానని, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
మరోసారి ట్రంప్ నోట ఆపరేషన్ సింధూర్ మాట..
దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) వ్యాపార నేతల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ మరోసారి “ఆపరేషన్ సిందూర్” గురించి మాట్లాడారు. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తాపే ఆపినట్లు చెప్పుకొచ్చారు. “ఆ సమయంలో రెండు దేశాలు తగువులో పడ్డాయి. ఏడు విమానాలు కూలిపోయాయని వార్తలు చూశాను. నేను వెంటనే మోదీకి ఫోన్ చేసి, యుద్ధం ఆపమని చెప్పాను. ట్రేడ్ డీల్ ఉండదని హెచ్చరించాను. అలాగే పాకిస్తాన్ నాయకుడికీ అదే చెప్పాను. రెండు రోజుల తర్వాత వారు యుద్ధం ఆపేశారు. ఇది అద్భుతం కాదా?” అని ట్రంప్ అన్నారు.
బైడెన్ చేసేవారా.?
మోదీ, పాకిస్తాన్ నేతలతో తాను మాట్లాడి యుద్ధాన్ని ఆపగలిగానని చెప్పిన ట్రంప్, “ఇది బైడెన్ అయితే చేయగలిగేవారా? అసలు కాదు” అని వ్యాఖ్యానించారు. మోదీ ఎంత అందంగా ఉన్నా, అంతే కఠినంగా కూడా ఉంటారని అన్నారు. “అతను ‘టఫ్ గయ్’, తన దేశ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయానికైనా వెనకాడడు” అని ఆయన అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గతంలో ట్రంప్ చాలా సార్లు చెప్పగా దీనిని భారత్ ఖండిస్తూ వచ్చింది. “ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏ విదేశీ నాయకుడూ భారత్ యుద్ధం ఆపమని అడగలేదు” అని మోదీ క్లారిటీ ఇచ్చారు.
త్వరలోనే భారత్-అమెరికా కొత్త వాణిజ్య ఒప్పందం
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య కొత్త ట్రేడ్ డీల్ (Trade Deal) పై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. రిపోర్టుల ప్రకారం, అమెరికా భారత ఎగుమతులపై విధిస్తున్న సుంకాలను ప్రస్తుతం ఉన్న 50% నుంచి 15 శాతానికి తగ్గించే అవకాశముంది. ఈ ఒప్పందం కుదిరితే, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ బలోపేతం అవుతాయని నిపుణులు అంటున్నారు.