కుక్కలనూ వదలరా..? శునక మాంసం తినడాన్ని నిషేధించే యోచనలో అధ్యక్షుడు
దక్షిణ కొరియాలో శతాబ్దాలుగా శునకాల మాంసాన్ని భుజిస్తున్నారు. అది వారి సంస్కృతిలో భాగంగా ఉన్నది. కానీ, ఇప్పుడిప్పుడే అక్కడి యువత, ఇప్పటి తరాలు కుక్క మాంసం తినడాన్ని ఆహ్వానించడం లేదు. ఆ దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్ స్వతహాగా జంతు ప్రేమికుడు.. స్వయంగా కుక్కలను తన నివాసంలో పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశంలో కుక్క మాంసంపై నిషేధం విధించే యోచన చేస్తున్నాడు. ప్రధానమంత్రికీ సూచన చేశాడు.
south korea
సియోల్: ఒక్కో సమాజ సంస్కృతి ఒకలా ఉంటుంది. దాని ఆచార వ్యవహారాలు, వేష భాషలు, ఆహారపుటలవాట్లు అన్ని దేనికవిగానే ఉంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వేషభాషలు, సంస్కృతిలతోపాటు హారపుటలవాట్లూ ఉంటాయి. ఒక్కో చోట తినే ఆహారం మరో చోట జుగుప్సాగా ఉండవచ్చు. వృక్ష సంపద నుంచి తినే ఆహారాలను మినహాయించి జంతువుల నుంచి తినే ఆహారాల్లోనే తేడాలే చర్చను తీవ్రతరం చేస్తుంటాయి. కొన్ని తెగలు, వర్గాలు తినే జంతువులు, ఇంకొన్ని తెగలు గౌరవించేవి లేదా స్నేహశీలివిగా ఉండవచ్చు. ఉదాహరణకు దక్షిణ కొరియాలో కుక్క మాంసం తినే సంస్కృతి ఉన్నది. కానీ, ప్రపంచంలో చాలా చోట్ల కుక్కలను మనిషికి సహజమైన మిత్రురాలిగా తెలుసు.
dog
దక్షిణ కొరియాలో కుక్క మాంసం తినడం పురాతనమైన ఒక ఆచారంగా వస్తున్నది. అయితే, ఇప్పటి తరాలు ఆ
సంస్కృతి ఏవగించుకుంటున్నారు. ముఖ్యంగా యువత శునకాలను తినడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కుక్కలను పెట్
డాగ్‌లుగా పెంచుకుంటున్నవారూ పెరుగుతున్నారు.
street dog
దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్ కూడా జంతు ప్రేమికుడు. కుక్కలను పెంచుకుంటున్నాడు. దేశంలోని
వస్తున్న మార్పుల రీత్యా, ఆయన స్వతహాగా జంతు ప్రేమికుడు కావడం చేత వాటిని తినడాన్ని నిషేధించాలనే
ఆలోచనలో ఉన్నాడు.
pet dogs
ఇదే విషయాన్ని దేశ ప్రధానమంత్రి కిమ్ బూ క్యుమ్‌ను అడిగాడు. కుక్క మాంసాన్ని తినడాన్ని నిషేధించే సమయం ఇప్పుడు కచ్చితంగా ఆసన్నమైనట్టుగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
అధ్యక్షుడు మూన్ జే ఇన్ తన నివాసంలో వీధుల్లో తప్పిపోయిన ఓ కుక్కను, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బహూకరించిన కుక్కులనూ జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు. అలాంటి మూన్ జే ఇన్ కుక్క మాంసంపై నిషేధం విధించాలని సూచించాడు. ఈ నిర్ణయాన్ని జంతు హక్కుల కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు.
Belgian Malinois Breed Dog
జంతు ప్రేమికులు, వాటి హక్కుల కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. డాగ్ ఫార్మింగ్ ఇండస్ట్రీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దేశంలో కనీసం 3000 కుక్కల ఫామ్‌లు ఉన్నాయి. ఈ పరిశ్రమపైనా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
dog
కుక్క మాంసంపై నిర్ణయాన్ని పౌరుల వ్యక్తిగతానికి వదిలిపెట్టాలని, పాలకులు తీసుకోవాల్సిన నిర్ణయం కాదని కొరియా డాగ్ మీట్ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ జు యాంగ్ బోంగ్ అన్నారు.ప్రెసిడెంట్ తన ఒకే రోజు కనీసం ఒక లక్ష మంది కుక్క మాంసాహారులను నేరస్తులుగా చేస్తారా?అని అడిగారు. శునకం మాంసం భుజించే సంస్కృతిగా గర్వించాలని ఆయన తెలిపారు. ఈ అసోసియేషన్‌లో కనీసం నాలుగు వేల డాగ్ మీట్ ఫార్మర్స్ ఉన్నారు.