MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • International
  • స్నేక్ ఫామ్ నుంచి కొట్టుకొచ్చిన 900 విష పాములు.. అరచేతిలో ప్రజల ప్రాణాలు. భయంకరమైన‌ వీడియో

స్నేక్ ఫామ్ నుంచి కొట్టుకొచ్చిన 900 విష పాములు.. అరచేతిలో ప్రజల ప్రాణాలు. భయంకరమైన‌ వీడియో

Snakes Video: దక్షిణ చైనాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఓ పాముల పెంపక కేంద్రం (స్నేక్ ఫామ్) పూర్తిగా దెబ్బతింది. దీంతో అక్కడ పెంచుతున్న వందలాది పాములు బయటకు వచ్చి వరద నీటితో పాటు నగరంలోకి చేరాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 08 2026, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొట్టుకుపోయిన స్నేక్ ఫామ్
Image Credit : channelnewsasia/Instagram

కొట్టుకుపోయిన స్నేక్ ఫామ్

దక్షిణ చైనాలో ఇటీవల మీసాక్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా గ్వాంగ్సీ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని హెంగ్‌జౌ ప్రాంతంలో ఉన్న ఒక పాముల పెంపక కేంద్రం వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో ఫామ్‌లోని పాములు బోన్ల నుంచి బయటకు వచ్చి వరద ప్రవాహంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దాదాపు 900 పాములు
Image Credit : channelnewsasia/Instagram

దాదాపు 900 పాములు

స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో 800 నుంచి 900 వరకు పాములు బయటకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. వీటిలో కింగ్ కోబ్రాలు, నాగుపాములు, వైపర్ జాతికి చెందిన అత్యంత విషపూరితమైన పాములు కూడా ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విషపాములు ఒకేసారి బయటకు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

35
పాములను పట్టుకునేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్
Image Credit : channelnewsasia/Instagram

పాములను పట్టుకునేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్

వరద ప్రభావిత ప్రాంతాల్లో పాములను గుర్తించి పట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. స్థానిక ప్రజలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పొలాల్లో పెద్ద వలలతో పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వీడియోలో వరద నీటిలో రోడ్డుపై ఒకేసారి అనేక విషపాములు పాకుతున్న దృశ్యాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CNA (@channelnewsasia)

45
ప్రజలకు హెచ్చరిక
Image Credit : channelnewsasia/Instagram

ప్రజలకు హెచ్చరిక

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటికే ఒక వ్యక్తిని పాము కాటేయగా అతడు చికిత్స పొందుతున్నాడు. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటితో నిండిన ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

55
మరిన్ని పాముల ఫామ్‌లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం
Image Credit : channelnewsasia/Instagram

మరిన్ని పాముల ఫామ్‌లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం

భారీ వరదల కారణంగా ఆ ప్రాంతంలోని మరికొన్ని చిన్న పాముల పెంపక కేంద్రాలు కూడా దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో మరిన్ని పాములు బయటకు వచ్చి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా, అన్ని పాములను పట్టుకునే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
ప్రపంచం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Related Stories
Recommended image1
Viral Video: క‌దిలే రైలులో శోభనం గది.. పండ్లు, పూల‌తో హంగామా. వైర‌ల్ అవుతోన్న వీడియో
Recommended image2
మ‌రో హైటెక్ సిటీగా మారుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతం.. కాగ్నిజెంట్ సెజ్ ఏర్పాటు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved