MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • International
  • విద్యార్థులతో లైంగిక సంబంధాలు.. రెండు రోజుల వ్యవధిలో వెలుగులోకి ఆరుగురు మహిళా టీచర్ల కీచక పర్వం..

విద్యార్థులతో లైంగిక సంబంధాలు.. రెండు రోజుల వ్యవధిలో వెలుగులోకి ఆరుగురు మహిళా టీచర్ల కీచక పర్వం..

విద్యార్థులకు చదవు చెప్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన కొందరు టీచర్ల బుద్ది తప్పుదోవ పడుతుంది. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా..బలవంతంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

2 Min read
Author : Sumanth K
| Updated : Apr 16 2023, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

విద్యార్థులకు చదవు చెప్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన కొందరు టీచర్ల బుద్ది తప్పుదోవ పడుతుంది. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా..బలవంతంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అమెరికాలో రెండు రోజుల వ్యవధిలో విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న ఆరుగురు మహిళా టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించి లైంగికంగా వేధించినట్టుగా వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వార్త విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

డాన్‌విల్లేకు చెందిన 38 ఏళ్ల ఎలెన్ షెల్‌పై థర్డ్ డిగ్రీ రేప్‌ చార్జ్ నమోదైంది. ఈ కేసులో దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదు ప్రకారం.. షెల్ ఇద్దరు 16 ఏళ్ల అబ్బాయిలతో మూడు సందర్భాలలో లైంగిక సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను గురువారం గారార్డ్ కౌంటీ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆమె వుడ్‌లాన్ ఎలిమెంటరీ స్కూల్‌లో టీచర్ సహాయకురాలిగా పనిచేశారు. అంతకుముందు లాంకాస్టర్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఉద్యోగం చేశారు. బాయిల్ కౌంటీ స్కూల్ అధికారులు అరెస్టు గురించి తల్లిదండ్రులకు ఒక లేఖ పంపినట్లు డబ్ల్యూకేఆర్ వార్తా పోర్టల్ నివేదించింది. ఇక, ప్రస్తుతం ఆమెను అడ్మినిస్ట్రేటివ్ సెలవుపై ఉంచారు.

37

ఇలాంటివి మొత్తం ఆరు కేసులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇక, అర్కాన్సాస్‌కు చెందిన 32 ఏళ్ల విద్యావేత్త హీథర్ హేర్ కూడా ఫస్ట్-డిగ్రీ నేరపూరిత దాడి రేప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె ఒక టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధంలో ఉందని అర్కాన్సాస్ టైమ్స్ నివేదించింది. మరోవైపు ఓక్లహోమాకు చెందిన 26 ఏళ్ల ఎమిలీ హాన్‌కాక్‌ను కూడా గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె విద్యార్థితో సంబంధాన్ని కలిగి ఉందనే ఆరోపణలపై స్థానిక పోలీసులకు సమాచారం అందండంతో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
 

47

ఇక, లింకన్ కౌంటీలోని ప్రత్యామ్నాయ ఉపాధ్యాయురాలను కూడా అరెస్ట్ చేశారు. ఆమెపై 15 ఏళ్ల విద్యార్థితో అనుచితమైన సంబంధానికి సంబంధించి అభియోగాలు మోపారు. ప్రత్యామ్నాయ ఉపాధ్యాయురాలు ఎమ్మా డెలానీ హాన్‌కాక్ వెల్‌స్టన్ పబ్లిక్ స్కూల్స్‌లో పనిచేశారని.. ఆ సంబంధం పాఠశాల భవనంలోనే జరిగిందని కోర్టు పత్రాలు చెబుతున్నాయి. వారు స్నాప్‌చాట్‌లో కూడా కమ్యూనికేట్ చేసుకున్నారు.
 

57

అయోవాలోని డెస్ మోయిన్స్‌లోని క్యాథలిక్ హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్ అయిన క్రిస్టెన్ గాంట్(36) ఒక టీనేజ్ విద్యార్థితో తన స్కూల్ లోపల, వెలుపల ఐదుసార్లు లైంగిక సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించినందుకు శుక్రవారం జాబితాలో చేర్చబడ్డారు.

67

ఇక, జేమ్స్ మాడిసన్ హైస్కూల్‌లో అల్లీహ్ ఖేరద్‌మాండ్ అనే ఉపాధ్యాయురాలు అనేక నెలల వ్యవధిలో విద్యార్థితో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ స్కూల్స్‌లో లెర్నింగ్ డిజేబుల్టీ టీచర్‌గా ఉన్న ఖేరద్‌మండ్‌పై నాలుగు లైంగిక వేధింపుల అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాకుండా బాండ్ లేకుండా నిర్బంధించబడ్డారు.

77

పెన్సిల్వేనియాకు చెందిన జావెలిన్ కోచ్ హన్నా మార్త్.. తాను కోచింగ్ చేస్తున్న 17 ఏళ్ల బాలుడితో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు. నార్తాంప్టన్ ఏరియా హైస్కూల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌తో లైంగిక సంబంధంలో నిమగ్నమైందని పోలీసులు కనుగొన్న తర్వాత ఆమెను అరెస్టు చేశారు.
 

About the Author

SK
Sumanth K

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image2
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image3
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved